LOADING...
Kavya Kalyani: 'నా చావుకి కారణం అభి'.. 'ఢీ' షో డ్యాన్సర్ కావ్యకళ్యాణి ఆత్మహత్య 
'నా చావుకి కారణం అభి'.. 'ఢీ' షో డ్యాన్సర్ కావ్యకళ్యాణి ఆత్మహత్య

Kavya Kalyani: 'నా చావుకి కారణం అభి'.. 'ఢీ' షో డ్యాన్సర్ కావ్యకళ్యాణి ఆత్మహత్య 

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 01, 2025
02:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు టెలివిజన్ ప్రేక్షకులకు 'ఢీ' రియాలిటీ ప్రోగ్రామ్ అనేకమంది యువతకు గుర్తింపు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ షో ద్వారా చాలా మంది డాన్సర్లు ప్రేక్షకాదరణ పొందారు. తాజాగా ఈ షోకి చెందిన ఓ డాన్సర్ పేరు మళ్లీ వార్తల్లో నిలిచింది. కానీ ఈసారి ఓ విషాదకర ఘటనతో సంబంధం ఉంది. ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ గ్రామానికి చెందిన కావ్యకళ్యాణి (24) ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయింది. ఆమె మరణానికి కారణం 'ఢీ' షో డాన్సర్ అభి అని తన సెల్ఫీ వీడియోలో వెల్లడించింది. ఆత్మహత్యకు ముందు కావ్యకళ్యాణి ఒక వీడియో రికార్డ్ చేసి తన బాధను వ్యక్తం చేసింది.

Details

అభిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

"నాకు న్యాయం జరగాలి. నేను చచ్చిపోతున్నాను. నా చావుకి కారణం అభి. 5 ఏళ్లుగా ప్రేమిస్తున్నానని చెప్పి పెళ్లి చేసుకున్నాడు. కానీ ఇప్పుడు నన్ను వదిలేసి మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు," అంటూ కన్నీటి పర్యంతమైంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖమ్మం పోలీసులు నిందితుడు అభిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. ఈ సంఘటన టాలీవుడ్ ఇండస్ట్రీలో కలకలం రేపగా, యువతి మృతి తీవ్ర సంచలనంగా మారింది.