LOADING...
Abhishek Bachchan: అభిషేక్ బచ్చన్ ఎమోషన్.. ఐశ్వర్య త్యాగానికి కృతజ్ఞతలు!
అభిషేక్ బచ్చన్ ఎమోషన్.. ఐశ్వర్య త్యాగానికి కృతజ్ఞతలు!

Abhishek Bachchan: అభిషేక్ బచ్చన్ ఎమోషన్.. ఐశ్వర్య త్యాగానికి కృతజ్ఞతలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 13, 2025
10:17 am

ఈ వార్తాకథనం ఏంటి

నటుడు అభిషేక్ బచ్చన్ తన విజయం వెనక భార్య ఐశ్వర్య రాయ్ ఉందని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన 70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో ఆయన ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్పీచ్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అభిషేక్ 'ఐ వాంట్‌ టు టాక్‌' చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్నారు. అవార్డును తన కుమార్తె ఆరాధ్యకు, తండ్రికి అంకితం చేశారు.

Details

ఆనందంగా ఉంది : అభిషేక్ 

ఇది నాకెంతో ప్రత్యేకం. ఇండస్ట్రీకి వచ్చి 25 ఏళ్లు అయింది. ఉత్తమ నటుడిగా అవార్డు వచ్చినందుకు ఆనందంగా ఉంది. ఈ స్పీచ్ కోసం ఎన్నో రోజులుగా ప్రాక్టీస్‌ చేశాను. నా కుటుంబం ముందు దీన్ని స్వీకరించడం రెట్టింపు సంతోషంగా ఉంది. నా కల సాకారమైందని అభిషేక్ అన్నారు. అవార్డుకు సహకరించిన వ్యక్తులందరికి కృతజ్ఞతలు తెలిపారు, ముఖ్యంగా 'ఐ వాంట్‌ టు టాక్‌' దర్శకుడిని ప్రత్యేకంగా అభినందించారు. ఆడియన్స్‌ను 25 సంవత్సరాలుగా ప్రోత్సహించినందుకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు.

Details

భార్యకు ప్రత్యేక కృతజ్ఞతలు

నా భార్య ఐశ్వర్య, కుమార్తె ఆరాధ్యకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలపాలి. నా కలలను సాకారం చేసుకోవడానికి వాళ్లు నన్ను ఎంతో ప్రోత్సహించారు. ఈ అవార్డుకు ఐశ్వర్య ప్రధాన కారణం. ఆమె త్యాగాల వల్లే నేను ఇక్కడ ఉన్నాను. అవార్డును నా కుమార్తెకు, తండ్రికి అంకితం చేస్తున్నానని వెల్లడించారు.