Nagabandam: అభిషేక్ నామా దర్శకత్వంలో 'నాగబంధం' ..ఇంట్రెస్టింగ్ గా టైటిల్ గ్లింప్స్!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్ తమ 9వ సినిమా ను అనౌన్స్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.
ఈ రోజు ఉగాది పండుగను పురస్కరించుకొని ఈ చిత్రానికి సంబంధించి కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేసింది.
ఈ చిత్రానికి నాగబంధం- ది సీక్రెట్ ట్రెజర్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.ఈ చిత్రం టైటిల్ గ్లింప్స్ వీడియో ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ వీడియో మొత్తం ఆసక్తికరంగా సాగింది. నాగబంధం కాన్సెప్ట్ తో సినిమా ఉండనుంది.
అంతేకాదు, వీడియోను చూసిన తర్వాత,సినిమా స్క్రిప్ట్ ఆధ్యాత్మిక, సాహసోపేత అంశాలతో నిండి ఉందని, తిరువనంతపురంలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయానికి అనుసంధానించబడిందని అర్థమవుతుంది.
Details
నాగబంధం చిత్రానికి రచయిత,దర్శకుడు అభిషేక్ నామా
నాగబంధం గురించి మరిన్ని వివరాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ చిత్రానికి నిర్మాత అభిషేక్ నామా రచయిత, దర్శకుడు.
అభిషేక్ పిక్చర్స్, థండర్ పిక్చర్స్ బ్యానర్‌తో రూపొందిన ఈ చిత్రానికి అభే సంగీత దర్శకుడు.
తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో 2025లో నాగబంధం భారీ తెరపైకి రానుంది.
ఈ సినిమాకి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
Twitter Post
Here it is #Nagabandham : The Secret Treasure 🤩🔥
— ABHISHEK PICTURES (@AbhishekPicture) April 9, 2024
Check out the Title glimpse 🐍https://t.co/iWDyfatkjJ
Unleash a new secret treasure in 2025 🤩#Abhishekpictures #AbhishekNama #ThunderStudios pic.twitter.com/nWzoHNLCTE