
Adivi Sesh : డెకాయిట్ షూటింగ్‌లో ప్రమాదం.. గాయపడ్డ మృణాల్ ఠాకూర్, అడివి శేష్
ఈ వార్తాకథనం ఏంటి
సినీ రంగంలో స్టంట్లు, యాక్షన్ సన్నివేశాలు చేసే సమయంలో నటులు గాయాల పాలవడం మామూలే. తాజాగా 'డెకాయిట్' సినిమా షూటింగ్‌లో హీరో అడివి శేష్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తీవ్ర గాయాలపాలైనట్టు సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇందులో లవ్, యాక్షన్‌కి ప్రాధాన్యతనిస్తూ కథను రూపొందిస్తున్నారు. తాజా షెడ్యూల్‌లో ఓ కీలక యాక్షన్ సీన్ చిత్రీకరణ జరుగుతుండగా, ఇద్దరు నటులు తమ పాత్రల కోసం శ్రమిస్తుండగా అణచలేని సంఘటన చోటుచేసుకుంది. అడివి శేష్, మృణాల్ ఇద్దరూ ఒక్కసారిగా కిందపడటంతో గాయాలయ్యాయి.
Details
ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నట్లు సమాచారం
అయితే గాయాలైనప్పటికీ వారిద్దరూ ప్రొఫెషనలిజం చూపుతూ ఆ సన్నివేశాన్ని పూర్తి చేసిన తర్వాతే హాస్పిటల్‌కు వెళ్లారని సమాచారం. గాయాలు పెద్దగా ప్రమాదకరంగా లేవని, ప్రస్తుతం వారు విశ్రాంతి తీసుకుంటున్నట్లు సమాచారం అందింది. ఈ ప్రమాదం సినిమా యూనిట్‌ను కాస్త కలచివేసినా, షూటింగ్‌లో అంతరాయం లేకుండా పనులు కొనసాగుతున్నాయి. 'డెకాయిట్' సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొనగా, ఈ యాక్షన్ ప్రమాదం సినిమాపై మరింత చర్చనీయాంశమవుతోంది.