Loading...
Raaka Update: దుబాయ్‌లో అనుకున్న యాక్షన్ సీక్వెన్స్ హైదరాబాద్‌లోనే.. 'రాకా' టీమ్ భారీ ప్లాన్
దుబాయ్‌లో అనుకున్న యాక్షన్ సీక్వెన్స్ హైదరాబాద్‌లోనే.. 'రాకా' టీమ్ భారీ ప్లాన్

Raaka Update: దుబాయ్‌లో అనుకున్న యాక్షన్ సీక్వెన్స్ హైదరాబాద్‌లోనే.. 'రాకా' టీమ్ భారీ ప్లాన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 09, 2026
03:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

'పుష్ప 2' వంటి సంచలన విజయం తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'రాకా'లో నటిస్తున్నారు. దాదాపు ఏడాదిన్నరగా ఈ భారీ ప్రాజెక్ట్ షూటింగ్‌లో బన్నీ బిజీగా ఉన్నారు. సినిమాలో ఎక్కువ భాగం చిత్రీకరణ ముంబైలోనే జరుగుతుండటంతో హైదరాబాద్, ముంబై నగరాల మధ్య తరచూ రాకపోకలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఎయిర్‌పోర్టుల్లోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఈ ప్రయాణాల నుంచి బన్నీకి ఎప్పుడు విముక్తి లభిస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

వివరాలు

హైదరాబాద్‌కు 'రాకా' టీమ్ షిఫ్ట్

ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న షూటింగ్ షెడ్యూల్ చివరి దశకు చేరుకుంది. ఇది ముగియగానే చిత్రబృందం మొత్తం హైదరాబాద్‌కు షిఫ్ట్ కానుంది.

రామోజీ ఫిల్మ్ సిటీ (RFC)లో కీలకమైన భారీ యాక్షన్ ఎపిసోడ్లను చిత్రీకరించేందుకు టీమ్ సన్నాహాలు చేస్తోంది.

వాస్తవానికి ఈ యాక్షన్ పార్ట్‌ను దుబాయ్‌లో చిత్రీకరించాలని తొలుత ప్లాన్ చేసినట్లు సమాచారం.

అయితే అక్కడ నెలకొన్న తీవ్రమైన ఎండల కారణంగా షూటింగ్‌ను హైదరాబాద్‌కు మార్చినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత మిగిలిన ప్రధాన సన్నివేశాలను విదేశాల్లో తెరకెక్కించనున్నారని సమాచారం.

వివరాలు

రూ.1000 కోట్ల భారీ బడ్జెట్‌తో 'రాకా'

దర్శకుడు అట్లీ 'రాకా' చిత్రాన్ని హాలీవుడ్ స్థాయి విజువల్స్, సాంకేతిక విలువలతో రూపొందిస్తున్నారు.

అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌పై ఉన్న అంచనాలతో ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ సినిమాను సుమారు రూ.1000 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.

ఇందులో బన్నీ ద్విపాత్రాభినయం (డ్యూయల్ రోల్) చేస్తున్నారనే వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి.

ADVERTISEMENT

వివరాలు

వచ్చే ఏడాది చివర్లో విడుదలకు ప్లాన్!

ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ దాదాపు 40-50 శాతం పూర్తయినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది వేసవి నాటికి మొత్తం చిత్రీకరణను పూర్తి చేసి, అదే ఏడాది చివర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం.

ఇతర భారీ చిత్రాలు విడుదల తేదీలను ముందుగానే ప్రకటించి, ఆ తర్వాత వాయిదా వేస్తున్న తరుణంలో 'రాకా' టీమ్ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి తేదీని అధికారికంగా ప్రకటించలేదు.

పూర్తి స్థాయిలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగిసిన తర్వాతే పక్కా విడుదల తేదీని వెల్లడించాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ADVERTISEMENT