Page Loader
Shihan Hussaini: కోలీవుడ్‌ నటుడు, పవన్‌ కల్యాణ్‌ గురువు షిహాన్‌ హుసై కన్నుమూత 
కోలీవుడ్‌ నటుడు, పవన్‌ కల్యాణ్‌ గురువు షిహాన్‌ హుసై కన్నుమూత

Shihan Hussaini: కోలీవుడ్‌ నటుడు, పవన్‌ కల్యాణ్‌ గురువు షిహాన్‌ హుసై కన్నుమూత 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 25, 2025
09:25 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ కోలీవుడ్‌ నటుడు షిహాన్‌ హుసైని (60) మృతిచెందారు. బ్లడ్‌ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఈ విషాద వార్తను ఆయన కుటుంబ సభ్యులు సామాజిక మాధ్యమాల ద్వారా అధికారికంగా వెల్లడించారు. షిహాన్‌ హుసైని మరణ వార్తపై సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ సంతాపం తెలియజేస్తున్నారు. అయితే, హుసైని ఏపీ డిప్యూటీ సీఎం, ప్రముఖ నటుడు పవన్‌ కళ్యాణ్ కు మార్షల్‌ ఆర్ట్స్‌, కరాటే, కిక్‌ బాక్సింగ్‌ వంటి యోధ కళల్లో శిక్షణ అందించారు.Embed

వివరాలు 

400 మందికి పైగా విద్యార్థులకు ప్రొఫెషనల్‌ శిక్షణ

షిహాన్‌ హుసైని 1986లో విడుదలైన 'పున్నగై మన్నన్‌' సినిమాతో తమిళ చిత్రసీమలో అడుగుపెట్టారు. అనేక చిత్రాల్లో నటించినప్పటికీ, విజయ్‌ ప్రధాన పాత్రలో నటించిన 'బద్రి' సినిమా ద్వారా ఆయనకు విశేష గుర్తింపు లభించింది. అంతేకాక, ఆయన ఆర్చరీ శిక్షకుడిగా కూడా పేరుగాంచారు. ఈ క్రమంలో 400 మందికి పైగా విద్యార్థులకు ప్రొఫెషనల్‌ శిక్షణ అందించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

షిహాన్‌ హుసై కన్నుమూత