Page Loader
Mohan Babu: నటుడు మోహన్ బాబు ఇంట్లో రూ.10 లక్షలు మాయం
నటుడు మోహన్ బాబు ఇంట్లో రూ.10 లక్షలు మాయం

Mohan Babu: నటుడు మోహన్ బాబు ఇంట్లో రూ.10 లక్షలు మాయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 25, 2024
11:01 am

ఈ వార్తాకథనం ఏంటి

నటుడు మంచు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం జరిగింది. హైదరాబాద్ లోని జల్‌పల్లి నివాసంలో రూ.10 లక్షలు పోయినట్లు ఆయన గుర్తించారు. పనిమనిషి నాయక్ ఆ డబ్బును చోరీ చేశారని తెలిపారు. ఈ ఘటనపై రాచకొండ సీపీకి ఆయన ఫిర్యాదు చేశారు. ఇక నిందితుడిని తిరుపతిలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. గతంలోనూ మోహన్ బాబు ఇంట్లో చోరి జరిగిన విషయం తెలిసిందే. 2019లో డబ్బులు, బంగారు అభరణాలు పనిమనిషి దొంగలించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.