NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Actor Pavithra Gowda: కస్టడీలో మేకప్ వేసుకున్న నటి పవిత్ర గౌడకు నోటీసులు 
    తదుపరి వార్తా కథనం
    Actor Pavithra Gowda: కస్టడీలో మేకప్ వేసుకున్న నటి పవిత్ర గౌడకు నోటీసులు 
    : కస్టడీలో మేకప్ వేసుకున్న నటి పవిత్ర గౌడకు నోటీసులు

    Actor Pavithra Gowda: కస్టడీలో మేకప్ వేసుకున్న నటి పవిత్ర గౌడకు నోటీసులు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jun 27, 2024
    09:50 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అభిమానిని దారుణంగా హత్య చేసి జైలుకెళ్లిన కన్నడ సూపర్ స్టార్ దర్శన్ తూగుదీప స్నేహితురాలు పవిత్ర గౌడ పోలీసుల కస్టడీలో మేకప్ వేసుకుంటూ కనిపించారు.

    వీడియోలో ఆమె మేకప్,లిప్ స్టిక్ వేసుకుంటూ కనిపించింది.పవిత్ర ముఖంలో కూడా నవ్వు వచ్చింది.

    ఆమె రిలాక్స్ అయినట్లు అనిపించింది.పవిత్ర హత్య కేసులో ప్రధాన నిందితురాలు.ఈ నిర్లక్ష్యంపై పోలీసు అధికారులు విధుల్లో ఉన్న మహిళా పోలీసులకు నోటీసులు జారీ చేశారు.

    దర్శన్, అతని స్నేహితురాలు నటి పవిత్ర ఒక అభిమానిని దారుణంగా హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

    వీరిద్దరూ రేణుకాస్వామి అనే వ్యక్తిని హత్య చేసేందుకు కాంట్రాక్ట్ ఇచ్చారు. ఇద్దరి సమక్షంలోనే హంతకులు అతనిపై దారుణంగా దాడికి పాల్పడ్డారు.

    వివరాలు 

    వీడియో బయటికి రావడంతో చర్చ

    అతని ప్రైవేట్ పార్ట్స్ పై గాయాలు చేయడమే కాకుండ, ముఖాన్ని కుక్కలు కొరికి కరెంటు షాక్ ఇచ్చి చంపేశారు.మహిళా నటికి అసభ్యకరమైన మెసేజ్‌లు పంపాడని ఆరోపించారు.

    రేణుకాస్వామి హత్యకేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న పవిత్రగౌడ క్రైమ్ సీన్ జరుగుతున్న సమయంలో నవ్వుతూ మేకప్ వేసుకుంటూ కనిపించారు.

    పవిత్రను పోలీసులు ఘటనా స్థలానికి తీసుకెళ్లారు.ఆమె మేకప్ బాక్స్‌తో అక్కడ కనిపించింది.

    ముఖానికి మేకప్,లిప్ స్టిక్ వేసుకున్నారు.పవిత్ర కూడా నవ్వుతూ చాలా ప్రశాంతంగా ఉంది.

    ఇంత దారుణంగా హత్య చేసినా పవిత్ర తన చర్యలకు ఏమాత్రం పశ్చాత్తాపం చెందడం లేదనే విషయంపై ఈవీడియో బయటికి రావడంతో చర్చ మొదలైంది.

    కాగా,పోలీసు అధికారుల తీవ్ర నిర్లక్ష్యంపై డీసీపీ(వెస్ట్)కార్యాలయం నుంచి లేడీఎస్‌ఐకి నోటీసులు జారీ చేసి వివరణ కోరింది.

    వివరాలు 

    అభిమాని హత్యకేసులో పవిత్ర ప్రధాన నిందితురాలు 

    రేణుకాస్వామి హత్యకేసులో కుట్రకు పాల్పడిన నిందితులుగా పవిత్ర గౌడను పోలీసులు నంబర్ వన్‌గా పేర్కొనగా, ప్రముఖ కన్నడ సినీ నటుడు దర్శన్ తూగుదీపను నంబర్ టూ నిందితుడిగా చేర్చడం గమనార్హం.

    పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, నటుడు రేణుకాస్వామి, పవిత్రకు అసభ్యకరమైన సందేశాలు పంపారు, ఇది దర్శన్‌కు కోపం తెప్పించింది .

    అతను కుట్ర చేసి హత్యకు పాల్పడ్డాడు. జూన్ 9వ తేదీన సుమనహళ్లిలోని ఓ అపార్ట్‌మెంట్ పక్కనే ఉన్న డ్రెయిన్ దగ్గర రేణుకాస్వామి మృతదేహం లభ్యమైంది.

    జూన్ 8న అతడిని చిత్రహింసలకు గురిచేసి హత్య చేసినట్లు సమాచారం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కర్ణాటక

    తాజా

    KPHB Open Plots: కేపీహెచ్‌బీలో స్థలాల వేలంలో రికార్డు ధరలు నమోదు.. గజం ధర రూ.2.98 లక్షలు హైదరాబాద్
    Singareni: సింగరేణి ఉద్యోగులకు రూ.1.25 కోట్ల ప్రమాదబీమా.. పీఎన్‌బీతో ఒప్పందం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్
    Telangana: శాసనసభ సమావేశాల్లోపు విత్తనచట్టం ముసాయిదా.. సిద్ధం చేయాలని మంత్రి తుమ్మల ఆదేశం తుమ్మల నాగేశ్వరరావు
    Stock Market : భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు… 1000 పాయింట్లకు పైగా కోల్పోయిన సెన్సెక్స్‌ స్టాక్ మార్కెట్

    కర్ణాటక

    Karnataka: కర్ణాటకలో 'హుక్కా' అమ్మకాలు, వినియోగంపై నిషేధం భారతదేశం
    Karnataka: స్నేహితుడికి అవమానకరమైన సందేశం పంపిన డ్రాయింగ్ టీచర్‌.. ప్రైవేట్ స్కూల్ బాలిక ఆత్మహత్య  ఆత్మహత్య
    Congress: తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్  కాంగ్రెస్
    Karnataka: దేవాలయాలపై పన్ను చెల్లించాల్సిందే.. కాంగ్రెస్ 'హిందూ వ్యతిరేక విధానాలను' తప్పుబట్టిన బీజేపీ  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025