Sayaji Shinde : సాయాజీ షిండేకు ఛాతి నొప్పి.. శస్త్ర చికిత్స నిర్వహించిన డాక్టర్లు
ప్రముఖ నటుడు సాయాజీ షిండే గుండెపోటు కారణంగా ఆస్పత్రిలో చేరారు.వెంటనే డాక్టర్లు అయనకి యాంజియోప్లాస్టీ నిర్వహించారు. ప్రస్తుతం సాయాజీ షిండే పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. సాయాజీ షిండే సతారాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అందిన సమాచారం మేరకు..సాయాజీ షిండే ఛాతి నొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం.ఈ సమస్య ఎక్కువగా కనిపించడంతో కొన్ని పరీక్షలు చేయించుకున్నారు. వెయిన్ బ్లాక్ ఉన్నట్లు గుర్తించారు. వెంటనే యాంజియోప్లాస్టీ చేయాలని వైద్యులు నిర్ణయించారు. సతారాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం, అయన పరిస్థితి బాగానే ఉందని, రెండు రోజుల్లో డిశ్చార్జి చేస్తామని వైద్యులు తెలిపారు.
సామాజిక సేవకు అంకితమైన సాయాజీ షిండే
కొన్ని రోజుల క్రితం సాయాజీ షిండే అస్వస్థతకు గురయ్యారని డాక్టర్ చెప్పారు. రొటీన్ చెకప్ గా కొన్ని టెస్టులు చేయగా, ECGలో కొన్ని మార్పులు కనిపించడంతో గుండెలో కొంత భాగం కదలిక తక్కువగా ఉన్నట్లు భావించారు. సాయాజీ షిండే ఇటీవలే తన 65వ పుట్టినరోజు జరుపుకున్నారు.నాటకం,సినిమాల్లో తనదైన నటనతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. అయన మరాఠీలోనే కాకుండా హిందీ,తెలుగు సినిమాల్లో కూడా పనిచేశారు.సతారా జిల్లాలోని ఓ కుగ్రామం నుంచి సినీ రంగానికి వచ్చిన సాయాజీ షిండే.. బాలీవుడ్, టాలీవుడ్ ఖ్యాతిని గడించారు. సినీ పరిశ్రమలో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన అయన , సామాజిక సేవకు కూడా అంకితమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆయన సహ్యాద్రి దేవరాయ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.