LOADING...
Robinhood: స్టైలిష్‌గా సిగరెట్‌ వెలిగిస్తున్న 'సామి'.. రాబిన్‌హుడ్‌లో 'దేవ్‌ దత్తా' స్టన్నింగ్‌ లుక్‌ వైరల్
రాబిన్‌హుడ్‌లో 'దేవ్‌ దత్తా' స్టన్నింగ్‌ లుక్‌ వైరల్

Robinhood: స్టైలిష్‌గా సిగరెట్‌ వెలిగిస్తున్న 'సామి'.. రాబిన్‌హుడ్‌లో 'దేవ్‌ దత్తా' స్టన్నింగ్‌ లుక్‌ వైరల్

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 05, 2025
05:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ హీరో నితిన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం "రాబిన్‌హుడ్‌". ఈ సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. ఇందులో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. . ఈ చిత్రం ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా.. పలు కారణాల విడుదల వాయిదా పడింది. తాజాగా, మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రమోషన్లలో భాగంగా, సామి లుక్‌ విడుదల చేశారు, ఇందులో ఆదిపురుష్ ఫేమ్ దేవా దత్త నాగే నటించాడు. టెంపోపై కూర్చొని స్టైలిష్‌గా సిగరెట్ వెలిగిస్తున్న అతని లుక్ సినిమాపై ఆసక్తిని పెంచింది.

వివరాలు 

అక్కాచెల్లెళ్ల మధ్య చిచ్చు పెడతానంటది.. 

ఈ సినిమాలో ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్‌ "ఏజెంట్‌ జాన్‌ స్నో" పాత్రలో కనిపించనుండగా, ఈ లుక్‌ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయింది. నవీన్‌ యేర్నేని, రవి శంకర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. సినిమా గ్లింప్స్‌లో నితిన్ చెప్పిన డైలాగ్ ఆసక్తికరంగా ఉంది రాబిన్‌హుడ్‌ గ్లింప్స్ వీడియోలో "డబ్బు చాలా చెడ్డది.. రూపాయి రూపాయి నువ్వేం చేస్తావంటే, అన్నదమ్ములు,అక్కాచెల్లెళ్ల మధ్య చిచ్చు పెడతానంటుంది. దేశమంతా నా కుటుంబం, ఆస్తులున్నవారు నా అన్నదమ్ములు, ఆభరణాలు వేసుకున్నవారు నా అక్కాచెల్లెల్లు. కానీ, అవసరానికి వాళ్ల జేబుల్లో చేతులు వేసినా, ఫ్యామిలీ మెంబర్ అనకుండా నాపై కేసులు పెడుతున్నారు.."అంటూ నితిన్ చెబుతున్న సంభాషణలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్