LOADING...
Adolescence: క్రిటిక్స్‌ ఛాయిస్‌ అవార్డ్స్‌లో 'అడాల్‌సెన్స్‌' సత్తా
క్రిటిక్స్‌ ఛాయిస్‌ అవార్డ్స్‌లో 'అడాల్‌సెన్స్‌' సత్తా

Adolescence: క్రిటిక్స్‌ ఛాయిస్‌ అవార్డ్స్‌లో 'అడాల్‌సెన్స్‌' సత్తా

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 05, 2026
12:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే క్రిటిక్స్‌ ఛాయిస్‌ అవార్డుల వేడుక జనవరి 4న ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నెట్‌ఫ్లిక్స్‌ సిరీస్ 'అడాల్‌సెన్స్‌' తన సత్తాను చాటుతూ నాలుగు ప్రధాన కేటగిరీల్లో అవార్డులు కైవసం చేసుకుంది. ఉత్తమ సిరీస్‌గా నిలిచిన 'అడాల్‌సెన్స్‌'లో అద్భుత నటనకు గానూ స్టీఫెన్‌ గ్రాహం ఉత్తమ నటుడిగా, ఎరిన్‌ డోహెర్టీ ఉత్తమ సహాయ నటిగా పురస్కారాలను అందుకున్నారు. అంతేకాదు, ఈ సిరీస్‌లో కీలక పాత్రలో నటించిన ఓవెన్‌ కూపర్ అతి చిన్న వయసులోనే ఉత్తమ సహాయ నటుడిగా క్రిటిక్స్‌ ఛాయిస్‌ అవార్డు గెలుచుకుని రికార్డు సృష్టించాడు. మొత్తం ఆరు నామినేషన్‌లకు గాను నాలుగు విభాగాల్లో విజేతగా నిలవడం విశేషం.

Details

ప్రేక్షకుల ఆదరణలోనూ 'అడాల్‌సెన్స్‌' ముందంజ

ఇదే సిరీస్‌ గతంలో జరిగిన 77వ ఎమ్మీ అవార్డ్స్‌లో ఐదు కేటగిరీల్లో విజయం సాధించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. అవార్డుల పరంగా మాత్రమే కాదు, ప్రేక్షకుల ఆదరణలోనూ 'అడాల్‌సెన్స్‌' ముందంజలో నిలిచింది. గతేడాది మార్చి 17న నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా విడుదలైన ఈ సిరీస్, విడుదలైన నాటి నుంచే భారీ వ్యూస్‌తో టాప్‌లో కొనసాగుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా వీక్షించబడిన సిరీస్‌ల జాబితాలో టాప్‌10లో స్థానం సంపాదించింది. పిల్లలపై సోషల్‌మీడియా ప్రభావం, ఆన్‌లైన్‌ ట్రోలింగ్‌ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తున్నాయన్న కోణంలో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. 13 ఏళ్ల వయసున్న ఓ బాలుడు తన తోటి విద్యార్థినిని హత్య చేసిన ఘటన నేపథ్యంలో కథను మలచి, సమాజానికి గట్టి సందేశాన్ని అందించేలా 'అడాల్‌సెన్స్‌'ను రూపొందించారు.

Advertisement