Sandeep Reddy Vanga: స్పిరిట్ తర్వాత సందీప్ వంగా నెక్స్ట్ మూవీ ఫిక్స్.. హీరో ఎవరంటే?
ఈ వార్తాకథనం ఏంటి
సందీప్ రెడ్డి వంగా.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పటివరకు ఆయన తెరకెక్కించింది మూడు సినిమాలే అయినప్పటికీ.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనాలు మాత్రం మామూలుగా లేవు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో 'స్పిరిట్' సినిమాను తెరకెక్కిస్తున్న ఆయన.. ఆ తర్వాత ఏ హీరోతో సినిమా చేయబోతున్నారన్నది ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అల్లు అర్జున్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో పాటు పలువురు బాలీవుడ్ హీరోల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. 'స్పిరిట్' తర్వాత మా హీరోతోనే సినిమా చేయాలంటూ ఆయా హీరోల అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులతో హోరెత్తిస్తున్నారు. అయితే, ఈ ప్రచారానికి సందీప్ రెడ్డి వంగా స్వయంగా ఫుల్‌స్టాప్ పెట్టారు.
వివరాలు
'యానిమల్ పార్క్' సీక్వెల్ కోసం ప్రయత్నాలు
తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన తదుపరి ప్రాజెక్ట్ గురించి స్పష్టత ఇచ్చారు.
'స్పిరిట్' సినిమా పనులు పూర్తయిన వెంటనే ఏమాత్రం విరామం తీసుకోకుండా బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్‌తో 'యానిమల్ పార్క్' సీక్వెల్‌ను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
దీంతో అల్లు అర్జున్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులతో పాటు బాలీవుడ్ హీరోల ఫ్యాన్స్ ఆశలకు ప్రస్తుతానికి బ్రేక్ పడినట్లయింది.
'స్పిరిట్' పూర్తికాగానే సందీప్ మళ్లీ బాలీవుడ్ బాట పట్టనున్నట్లు ఆయన వ్యాఖ్యలతో స్పష్టమైంది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.