ఏజెంట్ ట్విట్టర్ రివ్యూ: ప్రీమియర్స్ చూసిన వారు పంచుకుంటున్న విశేషాలివే
ఈ వార్తాకథనం ఏంటి
అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన ఏజెంట్ మూవీ, ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆల్రెడీ యూఎస్ ప్రీమియర్స్ నుండి టాక్ బయటకు వస్తోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఏజెంట్ సినిమా గురించి ప్రేక్షకులు ఏమంటున్నారో చూద్దాం.
ఏజెంట్ మూవీ మొదలు కావడం నార్మల్ గానే మొదలవుతుందట. కొత్త ప్లాట్ కాదనీ, రొటీన్ కథే అని అంటున్నారు. కాకపోతే అఖిల్ మాత్రం చాలా కొత్తగా కనిపించాడట.
అఖిల్ యాక్షన్, స్టైల్ బాగున్నాయని కామెంట్ చేస్తున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం అదిరిపోయిందని, ఆ టైమ్ లో బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉందని కామెంట్ చేసారు.
సినిమాలోని పాటలు మాత్రం నిరాశ పరిచాయనీ, నేపథ్య సంగీతం కూడా పేలవంగా ఉందని పెదవి విరుస్తున్నారు.
Details
ఏజెంట్ ను నడిపించిన అఖిల్
ముఖ్యంగా లవ్ ట్రాక్ అస్సలు బాలేదని అంటున్నారు. ఇంకా విలన్ పాత్ర సరిగ్గా లేదని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.
ఓవరాల్ గా చూసుకుంటే ఇంటర్వెల్, క్లైమాక్స్ మాత్రం వేరే లెవెల్లో ఉన్నాయని, మిగతా సినిమా మొత్తంలో అక్కడక్కడా బాగుందని, అఖిల్ యాక్షన్ కోసం సినిమా చూడొచ్చని రివ్యూలు రాస్తున్నారు.
ఏజెంట్ మూవీని సింగిల్ హ్యాండ్ తో అఖిల్ నడిపించాడని, అఖిల్ అంకిత భావం, కష్టపడిన తీరు తెరమీద కనిపించేస్తుందని అన్నారు.
ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్, సరెండర్ 2 సినిమా సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా కనిపించింది. హిప్ హాప్ థమిజ సంగీతం అందించిన ఈ సినిమాలో మళయాల నటుడు మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఏజెంట్ సినిమా ట్విట్టర్ రివ్యూ
#Agent first half starts with regular plot and some cringe scenes.
— praveen Chowdary kasindala (@PKasindala) April 27, 2023
Movie picks up it's pace at pre interval block designed too good with good BGM.#AkhilAkkineni good at his role
Most of the movie is not enagagble routine story.
May be the second half needs to save the movie. pic.twitter.com/nXBWrFSRtF
ట్విట్టర్ పోస్ట్ చేయండి
Twitter Post
Akhil One man Show 💥💥💥
— Srinivas (@srinivasrtfan2) April 28, 2023
Action Sequences Mathram 👌👌👌
Love story 😢😢😢
Songs 😢😢😢
BGM 🥵
Interval And Climax KCPD 💥💥💥
Negetive Reviews patinchukovadhu Movie Bagundhi 👍👍
Rating:3/5 #Agent #AkhilAkkineni pic.twitter.com/UUwvOYhVez