LOADING...
Ram Gopal Varma: వర్మ ట్వీట్‌తో వైరల్ అయిన మహేశ్-రాజమౌళి గొడవ
వర్మ ట్వీట్‌తో వైరల్ అయిన మహేశ్-రాజమౌళి గొడవ

Ram Gopal Varma: వర్మ ట్వీట్‌తో వైరల్ అయిన మహేశ్-రాజమౌళి గొడవ

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 25, 2026
05:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

అసాధ్యమనుకున్న పనులను కూడా సాధ్యంగా మార్చేస్తున్న సాంకేతిక అద్భుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ). ఏది నిజం, ఏది కట్టుకథ అన్నది గుర్తించలేనంత స్థాయిలో సమాచారం విస్తరిస్తోంది. ఏఐ సాయంతో తయారైన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా వేదికలపై వరదలా ప్రత్యక్షమవుతున్నాయి. తాజాగా అలాంటి ఒక వీడియోను సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ షేర్ చేశారు. ఆ వీడియోలో అసలు ఏముంది?

వివరాలు 

మహేశ్ పాస్‌పోర్ట్ విషయంపైనే ఇద్దరి మధ్య తగాదా

స్టార్ హీరో మహేష్ బాబు, ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి మధ్య వాగ్వాదం జరుగుతున్నట్లుగా కనిపించే ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'సినిమా ఈజ్ డెడ్' అనే వ్యాఖ్యతో వర్మ పంచుకున్న ఈ ఫైట్ క్లిప్‌పై నెటిజన్లు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు సృజనాత్మకతను ప్రశంసిస్తుంటే, మరికొందరు దీనిపై విమర్శలు గుప్పిస్తున్నారు. 'ఏఐతో ఏదైనా సృష్టించడం సాధ్యమే' అంటూ కామెంట్లు చేస్తున్నారు. 'వారణాసి ప్రమోషన్స్ సమయంలో తప్పకుండా ఈ వీడియోను ప్లే చేస్తారు' అని కొందరు రాస్తుండగా, 'మహేశ్ పాస్‌పోర్ట్ విషయంపైనే ఇద్దరి మధ్య ఈ తగాదా' అంటూ అభిమానులు సరదాగా స్పందిస్తున్నారు.

వివరాలు 

వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల 

మహేశ్ బాబు హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ ఎపిక్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం 'వారణాసి'. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం వేగంగా చిత్రీకరణ కొనసాగుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదల చేసిన కథా పరిచయ వీడియోతో పాటు, చిత్ర బృందం ఇచ్చిన ఇంటర్వ్యూల ద్వారా బయటపడ్డ వివరాలు 'వారణాసి'పై ఆసక్తిని మరింతగా పెంచాయి.

Advertisement