Loading...
Ajith Kumar: 'డేర్‌డెవిల్'గా అజిత్ ఎంట్రీ.. హిట్ డైరెక్టర్‌తో మరోసారి జతకట్టిన స్టార్ హీరో!
'డేర్‌డెవిల్'గా అజిత్ ఎంట్రీ.. హిట్ డైరెక్టర్‌తో మరోసారి జతకట్టిన స్టార్ హీరో!

Ajith Kumar: 'డేర్‌డెవిల్'గా అజిత్ ఎంట్రీ.. హిట్ డైరెక్టర్‌తో మరోసారి జతకట్టిన స్టార్ హీరో!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 04, 2026
09:46 am

ఈ వార్తాకథనం ఏంటి

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ ఇటీవల 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నారు. దర్శకుడు అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించగా, 2025 ఏప్రిల్ 10న విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ విజయోత్సాహంలోనే అజిత్ ఇప్పుడు తన 64వ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. 'డేర్‌డెవిల్' (Dare Devil) అనే పవర్‌ఫుల్ టైటిల్‌తో రూపొందనున్న ఈ చిత్రం ప్రకటనతోనే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. 'గుడ్ బ్యాడ్ అగ్లీ'తో హిట్ కాంబినేషన్‌గా నిలిచిన అధిక్ రవిచంద్రన్ మరోసారి దర్శకత్వం వహించనుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింత పెరిగాయి.

వివరాలు

పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా మూవీ

చిత్ర నిర్మాణ సంస్థ విడుదల చేసిన అధికారిక అనౌన్స్‌మెంట్‌తో పాటు ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

'Face the Fear'అనే ట్యాగ్‌లైన్ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేసింది. పోస్టర్‌ను బట్టి ఇది పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్నట్లు స్పష్టమవుతోంది.

అయితే సినిమా కథ, అజిత్ పాత్ర, ఇతర కీలక వివరాలను చిత్ర బృందం ప్రస్తుతం గోప్యంగానే ఉంచింది. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు.

అజిత్ స్టైల్‌కు అనిరుధ్ సంగీతం జతకావడంతో అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

గతంలో వీరి కాంబినేషన్‌కు వచ్చిన స్పందనను దృష్టిలో పెట్టుకుంటే, ఈ చిత్రంలో సంగీతం కూడా ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వివరాలు

'బ్రేవ్ హార్ట్ ప్రొడక్షన్' బ్యానర్‌పై మూవీ

మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రాన్ని అజిత్ సతీమణి శాలిని అజిత్ కుమార్ తన కొత్త నిర్మాణ సంస్థ 'బ్రేవ్ హార్ట్ ప్రొడక్షన్' బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.

ఇటీవలే ప్రారంభమైన ఈ నిర్మాణ సంస్థకు 'డేర్‌డెవిల్' తొలి భారీ ప్రాజెక్ట్‌గా నిలవనుంది. కుటుంబ నిర్మాణ సంస్థలో అజిత్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది.

ఇక 'గుడ్ బ్యాడ్ అగ్లీ'తో విజయవంతమైన కాంబినేషన్‌గా గుర్తింపు పొందిన అజిత్-అధిక్ రవిచంద్రన్ జోడీ, అదే విజయాన్ని కొనసాగించేలా 'డేర్‌డెవిల్'ను మరింత భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు సిద్ధమైంది.

ఇప్పటికే దర్శకుడు ప్రీ-ప్రొడక్షన్ పనులను పూర్తి చేసినట్లు సమాచారం. దీంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

ADVERTISEMENT