LOADING...
Ajith Kumar:'విశ్వంభర' సెట్‌లో హీరో అజిత్ సందడి
Ajith Vishwambhara set: చిరంజీవిని కలిసిన తమిళ స్టార్ అజిత్ కుమార్

Ajith Kumar:'విశ్వంభర' సెట్‌లో హీరో అజిత్ సందడి

వ్రాసిన వారు Stalin
May 29, 2024
06:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు నేపథ్యం వున్న తమిళ స్టార్ అజిత్ కుమార్,ఇవాళ మెగా స్టార్ చిరంజీవిని కలిశారు. అజిత్ గుడ్ బాడ్ అగ్లీ చిత్రంలో నటిస్తున్నారు.దీనికి అధిక్ రవి చంద్రన్ దర్శకుడిగా వున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది.ఈ సందర్భంగా విశ్వంభర సెట్ లో చిరును కలిసి ఫోటోలు దిగారు. స్టూడియో అంతా కలియ తిరిగి చిత్రయూనిట్ తో సరదాగా గడిపారు.ఈఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రాబోయే రోజుల్లో మెగా స్టార్,అజిత్ కలిసి నటించాలని అభిమానులు ఆశిస్తున్నారు. సోషియో ఫాంటసీ చిత్రంగా రూపు దిద్దుకుంటున్నవిశ్వంభరకు మల్లిడి వశిష్ట దర్శకుడిగా పని చేస్తున్నారు. ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా నటిస్తున్నారు. ఆషికా రంగనాధ్ ఈసినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోస్ ఇవే..