LOADING...
Akhanda2 Censor Review : అఖండ 2 సెన్సార్ టాక్ సెన్సేషన్.. పూర్తిగా శివ తాండవమే!
అఖండ 2 సెన్సార్ టాక్ సెన్సేషన్.. పూర్తిగా శివ తాండవమే!

Akhanda2 Censor Review : అఖండ 2 సెన్సార్ టాక్ సెన్సేషన్.. పూర్తిగా శివ తాండవమే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 02, 2025
10:36 am

ఈ వార్తాకథనం ఏంటి

హ్యాట్రిక్ సూపర్ హిట్స్‌ తర్వాత నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ చిత్రం 'అఖండ-2'పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, పాటలు మొత్తం కలిపి సినిమాపై హైప్‌ను మరింత పెంచాయి. తమన్ స్వరపరిచిన పాటలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది.

Details

సెన్సార్ పూర్తయ్యింది - ప్రపంచవ్యాప్తంగా విడుదలకు రెడీ

ఇంకా రెండు రోజుల్లో విడుదల కానున్న 'అఖండ 2' సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ లభించగా, వరల్డ్‌వైడ్ రిలీజ్‌కు పూర్తిగా సిద్ధమైంది. సెన్సార్ నుండి వచ్చిన టాక్‌ ప్రకారం ఫస్ట్ హాఫ్‌లో బాలయ్య ఎంట్రీ ఓ రేంజ్‌లో సెట్ అయ్యిందట. బోయపాటి ఫ్యాన్స్ మాత్రమే కాదు, సాధారణ ప్రేక్షకులకూ హైప్ ఇస్తుందని సమాచారం. అఘోర క్యారక్టర్ ప్రవేశంతో సినిమా మొత్తం పూర్తిగా మారిపోతుందట. ఇంటర్వెల్ ఎపిసోడ్ దాదాపు 20 నిమిషాల శివ తాండవంలా సాగుతుందని తెలుస్తోంది.

Details

సెకండాఫ్ మరో లెవెల్! 

సెకండ్ హాఫ్ ప్రేక్షకులు ఊహించిన దానికంటే చాలా మించి ఉండబోతుందని సెన్సార్ టాక్ చెబుతోంది. హిమాలయాల నేపథ్యంలో వచ్చే సీన్లు మహాకుంభమేళ ఎపిసోడ్ ఇవి రెండూ సినిమా హైలైట్లు కానున్నాయని తెలుస్తోంది. బాలయ్య యాక్షన్‌కు తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్లలో గూస్‌బంప్స్ గ్యారంటీ ఇస్తుందని అంటున్నారు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ప్రేక్షకులకు భారీ హై ఫీల్ ఇస్తాయని, బోయపాటి-బాలయ్య కాంబినేషన్ మరోసారి సంచలనానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. అన్నీ చూస్తుంటే బాలయ్య-బోయపాటి ద్వయం మరో బ్లాక్‌బస్టర్ సంచలనానికి రెడీగా ఉన్నట్టే అని చెప్పొచ్చు.

Advertisement