Akhanda 2: 'అఖండ 2' ఇష్యూ క్లియర్.. విడుదలపై తమ్మారెడ్డి కీలక వ్యాఖ్యలు!
ఈ వార్తాకథనం ఏంటి
బాలకృష్ణ అభిమానులు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న చిత్రం 'అఖండ 2' (Akhanda 2). ఆర్థిక ఇబ్బందుల కారణంగా చివరి నిమిషంలో వాయిదా పడిన ఈ సినిమాకు సంబంధించి తాజా సమాచారం వెలుగులోకి వచ్చింది. ఒక ఇంటర్వ్యూలో టాలీవుడ్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఈ చిత్రం సమస్యలు పరిష్కారమయ్యాయని వెల్లడించారు. ఆయన అంచనా ప్రకారం డిసెంబర్ 12న 'అఖండ 2' విడుదలయ్యే అవకాశం ఉందని తెలిపారు. తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తమ్మారెడ్డి భరద్వాజ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సంవత్సరంలో 'హరిహర వీరమల్లు', 'అఖండ 2' సినిమాల విడుదలలో ఆర్థిక అడ్డంకులు తలెత్తాయి. నిర్మాతలు గతంలో చేసిన ఆర్థిక కమిట్‌మెంట్‌లు ఆలస్యానికి కారణమయ్యాయి.
Details
డిసెంబర్ 12న విడుదలయ్యే అవకాశం
'హరిహర వీరమల్లు' ఇష్యూ క్లియర్ కావడంతో విడుదలైంది. ఇప్పుడు 'అఖండ 2' సమస్య కూడా పరిష్కారమైంది. నా అంచనా ప్రకారం డిసెంబర్ 12న విడుదల కావచ్చు. అందరూ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నందున మేకర్స్ వీలైనంత త్వరగా రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తారని అన్నారు. విడుదల ఆలస్యం సినిమాపై ప్రభావం చూపుతుందా అనే ప్రశ్నకు స్పందిస్తూ ఆయన చెప్పారు. సినిమా రిలీజ్ ఆలస్యం అయ్యిందని దాని రిజల్ట్ మారదు. ఓపెనింగ్స్ కూడా అంతే వస్తాయి. అయితే ముందుగా ప్రకటించిన తేదీకే విడుదలైతే ప్రేక్షకులు ముందుగానే సిద్ధమై రెవెన్యూలో కాస్త వ్యత్యాసం ఉంటుంది. రూ.3-4 కోట్లు తేడా రావొచ్చంతే. పెద్ద సినిమాలకు మొదటి మూడు రోజుల్లోనే ఎక్కువ రెవెన్యూ వస్తుందని తెలిపారు
Details
టికెట్ బుకింగ్స్ ఓపెన్
డిసెంబర్ 12 విడుదల తేదీపై వార్తలు బలంగా వినిపించడంతో పలు ప్రాంతాల్లో 'అఖండ 2' టికెట్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఓవర్సీస్‌లో కూడా ఈ చిత్రం విడుదల కానున్న విషయం తెలిసిందే. తాజాగా ఆస్ట్రేలియాలో బుకింగ్స్ ఓపెన్ కావడంతో మేకర్స్ త్వరలోనే అధికారిక ప్రకటన ఇవ్వనున్నట్లు అభిమానులు భావిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న 'అఖండ 2' అసలు డిసెంబర్ 5న విడుదల కావాల్సి ఉండగా, ఆర్థిక ఇబ్బందుల వల్ల చివరి నిమిషంలో వాయిదా పడిన విషయం తెలిసిందే.