LOADING...
Nagarjuna: 'లెనిన్'తో అఖిల్‌కు గొప్ప విజయం దక్కింది: నాగార్జున
'లెనిన్'తో అఖిల్‌కు గొప్ప విజయం దక్కింది: నాగార్జున

Nagarjuna: 'లెనిన్'తో అఖిల్‌కు గొప్ప విజయం దక్కింది: నాగార్జున

వ్రాసిన వారు Moogati Shabari
Jul 12, 2026
02:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

అక్కినేని అఖిల్‌కు చిన్ననాటి నుంచే తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలనే పట్టుదల ఎక్కువని, ప్రతి సినిమాను ఎంతో అంకితభావంతో చేస్తాడని అగ్ర నటుడు అక్కినేని నాగార్జున అన్నారు. ప్రతి ప్రాజెక్ట్ కోసం వంద శాతం శ్రమించినప్పటికీ విజయానికి కొద్ది దూరంలోనే ఆగిపోయేవాడని, అయితే 'లెనిన్' చిత్రం ద్వారా అతనికి తగిన గుర్తింపు, విజయం లభించిందని ఆయన పేర్కొన్నారు. నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మించిన 'లెనిన్' చిత్రం విజయోత్సవ వేడుక శనివారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అఖిల్ అక్కినేని హీరోగా నటించగా, భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా కనిపించారు. ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సందర్భంగా చిత్రబృందం ఈ వేడుకను నిర్వహించింది.

వివరాలు

తారక్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు..

ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాగార్జున తన కుమారుడు విజయాన్ని చూసి ఆనందం వ్యక్తం చేశారు. గత ఏడాది 'తండేల్' విజయోత్సవానికి హాజరయ్యానని గుర్తు చేసిన ఆయన, ఇప్పుడు 'లెనిన్' సక్సెస్ సెలబ్రేషన్స్‌లో పాల్గొనడం కూడా ఎంతో ఆనందంగా ఉందన్నారు. నాగచైతన్య, అఖిల్ ఇద్దరూ తనకు రెండు కళ్లలాంటి వారని, వారి విజయాల కోసం అభిమానులు ఎప్పుడూ ఎదురుచూస్తుంటారని చెప్పారు. 'తండేల్' విజయం సాధించినప్పుడు అభిమానులు ఎంత సంబరపడారో, ఇప్పుడు 'లెనిన్' విజయాన్ని కూడా అదే స్థాయిలో స్వాగతిస్తున్నారని నాగార్జున అన్నారు. ఈ చిత్రానికి తన గాత్రాన్ని అందించిన జూనియర్ ఎన్టీఆర్‌ను ప్రస్తావిస్తూ, ఆయనను తమ కుటుంబంలోని పెద్దబ్బాయిగా అభివర్ణించారు. సినిమా కోసం సహకరించిన తారక్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

వివరాలు

సంబరాల్లో చిత్ర యూనిట్..

హీరో అఖిల్ అక్కినేని మాట్లాడుతూ, తన గత చిత్రాల ఫలితాలను పక్కనపెట్టి 'లెనిన్' సినిమాను ఆదరించిన ప్రేక్షకుల ప్రేమకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయాన్ని ప్రేక్షకుల ఆశీర్వాదంగా భావిస్తున్నానని చెప్పారు. ఈ విజయోత్సవ కార్యక్రమంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ, కథానాయిక భాగ్యశ్రీ బోర్సేతో పాటు చిత్రబృంద సభ్యులు పాల్గొని తమ ఆనందాన్ని పంచుకున్నారు.

Advertisement