LOADING...
Lenin Review : అక్కినేని అఖిల్ 'లెనిన్' ఓవర్సీస్ టాక్.. సినిమా ఎలా ఉందంటే?
అక్కినేని అఖిల్ 'లెనిన్' ఓవర్సీస్ టాక్.. సినిమా ఎలా ఉందంటే?

Lenin Review : అక్కినేని అఖిల్ 'లెనిన్' ఓవర్సీస్ టాక్.. సినిమా ఎలా ఉందంటే?

వ్రాసిన వారు Moogati Shabari
Jul 10, 2026
09:59 am

ఈ వార్తాకథనం ఏంటి

అక్కినేని అఖిల్ కథానాయకుడిగా తెరకెక్కిన 'లెనిన్' చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పరిమిత అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాపై ఓవర్సీస్ ప్రేక్షకుల నుంచి వచ్చిన తొలి స్పందనను పరిశీలిస్తే, సినిమా ప్రారంభం నుంచే దర్శకుడు బలమైన కథా నేపథ్యం, ఆసక్తికరమైన పాత్రల పరిచయంతో ఆకట్టుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ అందించిన వాయిస్ ఓవర్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తన గంభీరమైన స్వరంతో కథను పరిచయం చేయడం వల్ల ప్రేక్షకులు ఆరంభంలోనే కథలో లీనమయ్యేలా చేసింది. అయితే మొదట్లో కనిపించిన ఆసక్తిని సినిమా ఎక్కువసేపు కొనసాగించలేకపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బలహీనంగా రాసిన ప్రేమకథతో పాటు రొటీన్ కమర్షియల్ అంశాలు కథన వేగాన్ని దెబ్బతీశాయి.

వివరాలు

ఇంటర్వెల్ ట్విస్ట్ అదుర్స్..

ఫస్ట్ హాఫ్ మధ్యభాగానికి చేరుకునే సరికి సినిమా నెమ్మదించిన భావన కలుగుతుందని, ముఖ్యంగా లవ్ ట్రాక్ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేదని ఓవర్సీస్ ప్రేక్షకులు చెబుతున్నారు. కథలో భావోద్వేగాలకు మంచి అవకాశం ఉన్నప్పటికీ, కొన్ని కీలక సందర్భాల్లో ఆ ఎమోషన్స్ పూర్తిస్థాయిలో ప్రేక్షకులను తాకలేకపోయాయి. అయితే ప్రీ-ఇంటర్వెల్ ఎపిసోడ్ నుంచి సినిమా మళ్లీ గాడిలో పడుతుంది. థమన్ అందించిన పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో పాటు దర్శకుడు రూపొందించిన ఇంటర్వెల్ బ్లాక్ ప్రేక్షకుల్లో మంచి ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ ట్విస్ట్ రెండో భాగంపై అంచనాలను మరింత పెంచుతూ, కథ ఎలాంటి మలుపులు తిరగబోతుందనే ఆసక్తిని రేకెత్తిస్తుంది.

వివరాలు

నటనతో ఆకట్టుకున్న అఖిల్..

సెకండాఫ్ ఆసక్తికరంగా ప్రారంభమై అదే ఊపును కొనసాగిస్తుందని టాక్ వినిపిస్తోంది. కథనం అనూహ్యమైన మలుపులతో ముందుకు సాగుతూ బలమైన ప్రభావాన్ని చూపుతుంది. మరోవైపు బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో కనిపించే పవర్‌ఫుల్ విలన్ తరహాలో ప్రతినాయకుడి క్రూరత్వాన్ని చూపించిన తీరు ప్రీ-క్లైమాక్స్ ఎపిసోడ్లకు మరింత బలం చేకూర్చిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. సినిమాలో అత్యంత కీలకమైన ఒక సన్నివేశంలో అఖిల్ తన నటనతో ప్రత్యేకంగా ఆకట్టుకున్నాడని ఓవర్సీస్ ప్రేక్షకులు చెబుతున్నారు. ఆ సీన్‌లో నేపథ్య సంగీతం లేకపోవడం, అదనపు సినిమాటిక్ హంగులు లేకపోవడం వల్ల ప్రేక్షకుల దృష్టంతా పూర్తిగా అఖిల్ నటనపైనే నిలుస్తుంది. తన హావభావాలు, నటనతో ఆ సన్నివేశాన్ని మరింత ప్రభావవంతంగా మలిచాడని ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

వివరాలు

సందడి చేస్తున్న ఫ్యాన్స్

మొత్తంగా చూస్తే 'లెనిన్' చిత్రానికి ఇంటర్వెల్, క్లైమాక్స్ ఎపిసోడ్లు ప్రధాన బలాలుగా నిలిచాయి. అఖిల్ కెరీర్‌లోనే అత్యుత్తమ నటనను ఈ చిత్రంలో కనబరిచాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఫస్ట్ హాఫ్‌లో కనిపించే నెమ్మదైన కథనం, భావోద్వేగం లేని ప్రేమకథ, కొన్ని చోట్ల తడబడిన స్క్రీన్‌ప్లే, రొటీన్ కమర్షియల్ ఫార్మాట్‌లో సాగిన కథనం కారణంగా సినిమా పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయిందని ఓవర్సీస్ ప్రేక్షకుల తొలి స్పందన చెబుతోంది.

Advertisement