NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Akkineni Family : అఖిల్ రిసెప్షన్ .. ఒకే ఫ్రేమ్ లో అక్కినేని కుటుంబం!
    తదుపరి వార్తా కథనం
    Akkineni Family : అఖిల్ రిసెప్షన్ .. ఒకే ఫ్రేమ్ లో అక్కినేని కుటుంబం!
    అఖిల్ రిసెప్షన్ .. ఒకే ఫ్రేమ్ లో అక్కినేని కుటుంబం!

    Akkineni Family : అఖిల్ రిసెప్షన్ .. ఒకే ఫ్రేమ్ లో అక్కినేని కుటుంబం!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jun 11, 2025
    04:38 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అక్కినేని అఖిల్ వివాహం జూన్ 6న ప్రియురాలు జైనబ్ రవ్జీతో జరిగింది. ఈ వేడుకలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులే పాల్గొన్నారు.

    కానీ జూన్ 8న జరిగిన రిసెప్షన్ వేడుక మాత్రం గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ రిసెప్షన్‌కు సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

    ఈ నేపథ్యంలో అఖిల్-జైనబ్ రిసెప్షన్ ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమానికి అక్కినేని ఫ్యామిలీ మొత్తం హాజరైంది.

    అంతేకాదు వారంతా కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగారు. ఆ గ్రూప్ ఫోటో ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతోంది.

    అక్కినేని అభిమానులు, కుటుంబానికి సమీపంగా ఉన్నవారు ఈ ఫోటోను షేర్ చేస్తూ తన అభిమానం వ్యక్తం చేస్తున్నారు.

    Details

    వైరల్ అవుతున్న ఫోటోలు

    వైరల్ అవుతోన్న ఫోటోలో నాగార్జున, అమల, అఖిల్, జైనబ్, నాగచైతన్య, శోభిత ధూళిపాలతో పాటు నాగార్జున అన్నయ్య అక్కినేని వెంకట్, ఆయన భార్య, పిల్లలు, అలాగే నాగార్జున చెల్లి నాగ సుశీల, ఆమె కుమారుడు హీరో సుశాంత్, నాగార్జున బావ సురేంద్ర యార్లగడ్డ, ఆయన కుమారుడు హీరో సుమంత్, కుమార్తె సుప్రియ యార్లగడ్డ తదితరులు కనిపిస్తున్నారు.

    ఈ ఫోటోలో అక్కినేని ఫ్యామిలీకి చెందిన పలువురు కజిన్స్ కూడా ఉండటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

    అక్కినేని కుటుంబ సభ్యులందరిని ఒకే ఫ్రేమ్‌లో చూసే అవకాశం అరుదైనదిగా భావిస్తూ, అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఈ ఫోటోను పంచుకుంటున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అక్కినేని అఖిల్

    తాజా

    Akkineni Family : అఖిల్ రిసెప్షన్ .. ఒకే ఫ్రేమ్ లో అక్కినేని కుటుంబం! అక్కినేని అఖిల్
    Pakistan: భారత్ దెబ్బకు తాళలేక టార్పలిన్‌లతో 'మేకప్' చేస్తున్న పాకిస్తాన్ ఆపరేషన్‌ సిందూర్‌
    IRCTC: జులై 1 నుంచి కొత్త నిబంధన.. తత్కాల్ టికెట్ బుకింగ్‌కి ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి! రైల్వే బోర్డు
    Stock Market: స్వల్ప లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు .. సెన్సెక్స్@ 25141  స్టాక్ మార్కెట్

    అక్కినేని అఖిల్

    ఏజెంట్ సినిమాలో సర్ప్రైజ్ ఇవ్వబోతున్న రామ్ చరణ్  తెలుగు సినిమా
    ఏజెంట్ ట్విట్టర్ రివ్యూ: ప్రీమియర్స్ చూసిన వారు పంచుకుంటున్న విశేషాలివే  ఏజెంట్
    తెలుగులో రెండవ సినిమా చేసేందుకు రెడీ కాబోతున్న జాన్వీ కపూర్, ఈసారి అక్కినేని వారసుడితో రొమాన్స్  తెలుగు సినిమా
    మూడు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న ఏజెంట్, స్ట్రీమింగ్ ఎక్కడంటే?  ఓటిటి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025