అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ మూవీ ఓటిటిలో రిలీజ్ కాకపోవడానికి కారణమేంటంటే?
అక్కినేని అఖిల్, సాక్షి వైద్య హీరో హీరోయిన్లుగా నటించిన ఏజెంట్ చిత్రం, ఈరోజు నుండి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవనుందని ఎన్నో రోజులుగా వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని స్వయంగా సోనీ లివ్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేసింది కూడా. అయితే సడన్ గా సోనీ లివ్ అందరికీ షాక్ ఇచ్చింది. ఏజెంట్ చిత్రం సోనీ లివ్ లో రిలీజ్ కాలేదు. దీంతో అసలు ఏం జరిగిందని అక్కినేని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఏజెంట్ సినిమా ఓటీటీ రిలీజ్ మరో వారం రోజులు వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ సినిమా, థియేటర్లలో విడుదలై 30రోజులు కూడా కాలేదు కాబట్టి ఇప్పుడప్పుడే ఓటీటీలో రిలీజ్ చేయడం లేదని తెలుస్తోంది.
వారం రోజుల తర్వాత ఓటీటీలో రిలీజ్
మరో వారం రోజుల తర్వాత ఏజెంట్ సినిమా ఓటీటీలో అందుబాటులో ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరేం జరుగుతుందో చూడాలి. అక్కినేని అఖిల్ కెరీర్లో ఏజెంట్ సినిమా అతిపెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. దాదాపు 80కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కిందని సమాచారం. కానీ ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 13.35 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయని చెబుతున్నారు. ఏజెంట్ సినిమా కథ ఏంటంటే: రీసెర్చ్ అనాలసిస్ వింగ్ లో రిక్కీ అనే పేరుతో ఏజెంట్ గా పనిచేసే రామకృష్ణ (అక్కినేని అఖిల్), దేశానికి వ్యతిరేకంగా పనిచేసే ధర్మ (డినోమోరియో)ను అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తుంటాడు. మరి వీరిద్దరి మధ్య పోరాటం ఎలా జరిగింది? చివరకు ఎవరు గెలిచారన్నదే సినిమా కథ.