Akkineni Akhil : రాయలసీమ యాక్షన్ డ్రామాలో తాతగా మారిన అక్కినేని అఖిల్
ఈ వార్తాకథనం ఏంటి
అక్కినేని అఖిల్‌కు సరైన హిట్ కోసం వేచి ఉన్నాడు. 'ఏజెంట్' భారీ డిజాస్టర్ తర్వాత కొంత విరామం తీసుకున్న అఖిల్, ఇప్పుడు దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'లెనిన్' సినిమాలో నటిస్తున్నాడు. రాయలసీమ నేపథ్యంతో పక్కా మాస్, రస్టిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో ఒక కీలకమైన ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని సమాచారం. ఈ ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాల్లో అఖిల్ సుమారు 50 ఏళ్ల వృద్ధుడి పాత్రలో కనిపించబోతున్నట్లు టాక్. పవర్‌ఫుల్ యాక్షన్ ఎపిసోడ్‌లో భాగంగా వచ్చే ఈ లుక్ కోసం అఖిల్ ప్రత్యేకంగా మేకోవర్ అయినట్లు తెలుస్తోంది. సినిమాలో దాదాపు నాలుగు నిమిషాల పాటు ఈ వృద్ధుడి పాత్రలో అఖిల్ కనిపించనున్నారు.
Details
మే 1న విడుదల చేసేందుకు ప్లాన్
ఆ కొద్దిసేపే అయినా ఆయన నటన, లుక్ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంటాయని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. 'లెనిన్' షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా, సంగీతాన్ని తమన్ అందిస్తున్నారు. అఖిల్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో, ప్రతిష్టాత్మకమైన కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాపై అక్కినేని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. రాయలసీమ యాసలో అఖిల్ చెప్పే డైలాగులు, ఆయన కొత్త లుక్ సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలవనున్నాయని సమాచారం. మే 1న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అఖిల్ కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నారు.