
Kannappa: అక్షయ్ కుమార్ లుక్ సూపర్బ్… 'కన్నప్ప' రిలీజ్ డేట్ వచ్చేసింది!
ఈ వార్తాకథనం ఏంటి
మంచు విష్ణు హీరోగా కలల ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం 'కన్నప్ప' జూన్ 27న గ్రాండ్‌గా థియేటర్లకు రానుంది.
ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలు ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పాయి.
ప్రమోషన్ కార్యాచరణను ప్రారంభించిన మంచు విష్ణు ఇటీవల అమెరికాలో ప్రేక్షకుల మధ్య ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు.
ఇదిలా ఉండగా, ఈ సినిమా నుంచి మూడో (చివరి) యానిమేటెడ్ ఎపిసోడ్‌ను మేకర్స్ విడుదల చేసిన కొన్ని రోజులకే ఆదివారం అక్షయ్ కుమార్ 'పరమశివుడు' పాత్రలో పూర్తి గెటప్ తో ఉన్న ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు.
Details
శివుడి వేషధారణలో అక్షయ్ కుమార్
ఇందులో అక్షయ్ కుమార్ శివుడి వేషధారణలో అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తున్నారు.
ఈ లుక్ నార్త్ ఇండియాలో ఎక్కువగా కనిపించే శివుడి రూపాలకు దగ్గరగా ఉండడం విశేషం.
అయితే, ఈ లుక్‌లో శివుడి మెడలో పాము లేకపోవడం కొంత గమనార్హ అంశంగా నిలిచింది.
ఈ సినిమాలో పార్వతీ దేవిగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. ఓ పౌరాణిక గాధ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొనడం విశేషం.