Loading...
Katrina Kaif : ప్రసవం తర్వాత కత్రినా రూపంపై ట్రోలింగ్.. అండగా నిలిచిన బాలీవుడ్ తారలు
ప్రసవం తర్వాత కత్రినా రూపంపై ట్రోలింగ్.. అండగా నిలిచిన బాలీవుడ్ తారలు

Katrina Kaif : ప్రసవం తర్వాత కత్రినా రూపంపై ట్రోలింగ్.. అండగా నిలిచిన బాలీవుడ్ తారలు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 17, 2026
10:37 am

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ప్రసవం తర్వాత శరీరాకృతిలో వచ్చిన మార్పులపై ఆన్‌లైన్‌లో ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. కొందరు నెటిజన్లు ఆమె రూపంపై ప్రతికూల వ్యాఖ్యలు చేస్తుండగా.. సహనటులు, అభిమానులు మాత్రం ఆమెకు మద్దతుగా నిలుస్తూ విమర్శలకు గట్టి సమాధానం ఇస్తున్నారు.

వివరాలు 

ప్రసవం తర్వాత బయటకు..

సహ నటుడు విక్కీ కౌశల్‌ను వివాహం చేసుకున్న కత్రినా కైఫ్.. కుమారుడు విహాన్ జన్మించిన తర్వాత చాలా తక్కువగా బహిరంగంగా కనిపించారు.

గత నెలలో ఓ ప్రార్థనా సమావేశానికి హాజరైన ఆమె.. ఇటీవల అంబానీ కుటుంబం నిర్వహించిన గణేశ్ ఉత్సవాల్లోనూ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఆ ఫొటోల్లో కత్రినా బరువు పెరిగినట్లు కనిపించడంతో కొందరు నెటిజన్లు ఆమెను లక్ష్యంగా చేసుకున్నారు.

ప్రెగ్నెన్సీకి ముందు, తర్వాత ఫొటోలను పోలుస్తూ.. ఆమె కెరీర్ ముగిసిపోయిందంటూ కొందరు దారుణమైన కామెంట్లు చేశారు. ఈ వ్యాఖ్యలు బాడీ షేమింగ్‌కు దారితీశాయి.

వివరాలు 

ట్రోల్స్‌కు అలీ జాఫర్ కౌంటర్..

కత్రినాపై జరుగుతున్న ట్రోలింగ్‌పై ఆమె సహనటులు స్పందిస్తున్నారు.

'మేరే బ్రదర్ కీ దుల్హన్' సినిమాలో ఆమెతో కలిసి నటించిన పాకిస్థానీ నటుడు అలీ జాఫర్.. కత్రినాకు మద్దతుగా ఓ వీడియో విడుదల చేశారు.

"మహిళల పట్ల పురుషులు తమ దృక్పథాన్ని మార్చుకోవాలి. ఆమెను బతకనివ్వండి.. మీకేంటి బాధ?" అంటూ ట్రోల్స్‌ను ఉద్దేశించి ఆయన గట్టిగా ప్రశ్నించారు. మహిళల శరీరాకృతిపై అనవసర వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు.

ADVERTISEMENT

వివరాలు 

'ఇదే మాతృత్వం!'.. శివలీక ఒబెరాయ్

నటి శివలీక ఒబెరాయ్ సైతం కత్రినాకు మద్దతు తెలిపారు. 'ఇదే మాతృత్వం!' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

తల్లయ్యాక శరీరంలో మార్పులు రావడం సహజమని, వాటిని విమర్శించాల్సిన అవసరం లేదని ఆమె పేర్కొన్నారు.

మరోవైపు నటి అలియా భట్ కూడా కత్రినా కైఫ్ తాజా ఫొటోలను లైక్ చేయడం ద్వారా పరోక్షంగా తన మద్దతు తెలిపారు.

దీంతో పలువురు అభిమానులు సైతం కత్రినాకు అండగా నిలుస్తూ ట్రోల్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

విమర్శలపై స్పందించని కత్రినా.. కుటుంబంపైనే పూర్తి దృష్టి

ఈ ఘటనతో బాలీవుడ్‌లో మహిళా నటులు ఎదుర్కొంటున్న శరీరాకృతి సంబంధిత ఒత్తిడి, అందంపై సమాజంలో ఉన్న ప్రమాణాలపై మరోసారి చర్చ మొదలైంది.

ముఖ్యంగా ప్రసవం తర్వాత మహిళల శరీరంలో వచ్చే సహజ మార్పులను గౌరవించాల్సిన అవసరంపై పలువురు దృష్టి సారిస్తున్నారు.

అయితే ఈ ఆన్‌లైన్ విమర్శలపై కత్రినా కైఫ్ ఇప్పటివరకు స్వయంగా స్పందించలేదు.

ప్రస్తుతం ఆమె తన కుటుంబంతో పాటు బ్యూటీ బిజినెస్‌కు సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

ADVERTISEMENT