LOADING...
Alia Bhatt: బాఫ్టా 2026 వేడుకల్లో మెరిసిన అలియా భట్
బాఫ్టా 2026 వేడుకల్లో మెరిసిన అలియా భట్

Alia Bhatt: బాఫ్టా 2026 వేడుకల్లో మెరిసిన అలియా భట్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 23, 2026
10:00 am

ఈ వార్తాకథనం ఏంటి

బాఫ్టా అవార్డుల వేడుకలో బాలీవుడ్ నటి 'అలియా భట్' ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఫిబ్రవరి 22న జరిగిన బాఫ్టా కార్యక్రమంలో ఆమె ప్రెజెంటర్‌గా వ్యవహరించారు. తొలిసారిగా ఈ అంతర్జాతీయ వేడుకకు హాజరైన అలియా, రెడ్ కార్పెట్‌పై తన స్టైల్‌తో హోయలొలికించారు. ఈ సందర్భంగా మాట్లాడిన అలియా తన సినీ ప్రయాణం మరియు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. చిన్నప్పటి నుంచే ఇండస్ట్రీలోకి రావాలన్న కల తనదని, సినిమాల్లో నటించడానికే పుట్టానేమో అనిపిస్తుందని చెప్పారు. కెమెరా ముందు నిలబడిన ప్రతిసారి తనలో ఒక కొత్త ఉత్సాహం ఉప్పొంగుతుందని వెల్లడించారు. ఈ పరిశ్రమలో భాగం కావడం తనకు ఒక వరమని, నటనను తాను బాధ్యతగా భావిస్తానని, దానిపట్ల ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటానని చెప్పారు.

Details

భావోద్వేగాలే సినిమాను ముందుకు నడిపిస్తాయి

సినిమాను ఆస్వాదించడానికి భాష అవసరం లేదని, భావోద్వేగాలే సినిమాను ముందుకు నడిపిస్తాయని అలియా అభిప్రాయపడ్డారు. తన కుమార్తె రాహా తనకు ఎంతో స్ఫూర్తినిస్తోందని, తన పాటలకు రాహా డ్యాన్స్ చేస్తుంటే తాను అపారమైన ఆనందాన్ని అనుభవిస్తానని పేర్కొన్నారు. ఇదే వేడుకలో బెస్ట్ చిల్డ్రన్ అండ్ ఫ్యామిలీ విభాగంలో మణిపురి చిత్రం 'బూంగ్' అవార్డును సొంతం చేసుకుని ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన 'లక్ష్మి ప్రియదేవి' కూడా బాఫ్టా వేడుకకు హాజరయ్యారు. తల్లిని బహుమతితో ఆశ్చర్యపరచాలని ప్రయత్నించే 'బూంగ్' అనే బాలుడి కథతో ఈ చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే.

Advertisement