
Ayalaan Movie : 'అయలాన్' మూవీ నుంచి క్రేజీ అప్డేట్.. ఏకంగా దుబాయిలో ట్రైలర్ లాంచ్!
ఈ వార్తాకథనం ఏంటి
తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా రూపొందిస్తున్న పాన్ ఇండియా సినిమా 'అయలాన్' (Ayalaan).
ఈ మూవీకి ఆర్. రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.
అస్కార్ అవార్డు గ్రహిత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
అయలాన్ అంటే ఏలియన్ అని అర్థం.
సోషియో సైంటిఫిక్ కథతో తీస్తున్న ఈచిత్రాన్ని మొన్న దీపావళికి రిలీజ్ చేయాలని భావించారు.
అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల అది జరగలేదు.
ముఖ్యంగా క్వాలిటీ గ్రాఫిక్స్ కోసం చిత్ర యూనిట్ చాలా కష్టపడింది.
'అయలాన్'లో 4500లకు పైగా వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్నాయని, ఇండియన్ సినిమా హిస్టరీలో ఎన్ని వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్న ఫుల్ లెంగ్త్ లైవ్ యాక్షన్ సినిమా ఇదేనని చిత్ర బృందం ప్రకటించింది.
Details
దుబాయ్ లో ట్రైలర్ లాంచ్
జనవరిలో ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ఆనౌన్స్ చేశారు. అయితే ఈ ప్రచారంపై చిత్ర నిర్మాతలు ఇంకా స్పందించలేదు.
తాజాగా ఈ మూవీ నుండి ఓ క్రేజీ అప్డేట్ బయటికొచ్చింది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి చిత్ర యూనిట్ పెద్ద ఎత్తున్న ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది.
జనవరి 7న దుబాయిలో అంగరంగ వైభవంగా ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.