Page Loader
Allu Arjun: అల్లు అర్జున్‌.. త్రివిక్రమ్‌ మూవీ.. నాగవంశీ కీలక అప్డేట్ 
అల్లు అర్జున్‌.. త్రివిక్రమ్‌ మూవీ.. నాగవంశీ కీలక అప్డేట్

Allu Arjun: అల్లు అర్జున్‌.. త్రివిక్రమ్‌ మూవీ.. నాగవంశీ కీలక అప్డేట్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 01, 2025
02:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

'పుష్ప 2'లో మాస్ యాక్షన్‌తో అల్లు అర్జున్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఈ చిత్రం భారీ విజయం సాధించడంతో, ఆయన తదుపరి ప్రాజెక్టుపై భారీ స్థాయిలో ఆసక్తి పెరిగింది. తాజాగా, ఈ విషయంపై నిర్మాత నాగవంశీ కీలక అప్‌డేట్‌ను పంచుకున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ మైథలాజికల్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి నాగవంశీ ఇటీవల కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ చిత్రం సోషియో ఫాంటసీ కాదని, పూర్తిగా పురాణాల ఆధారంగా నిర్మించబడుతుందని స్పష్టం చేశారు. షూటింగ్ అక్టోబర్ నుండి ప్రారంభమవుతుందని తెలిపారు.

వివరాలు 

కుమారస్వామిగా అల్లు అర్జున్

ఇక అల్లు అర్జున్ ఇందులో కుమారస్వామిగా కనిపించనున్నారనే వార్తలు గతంలో వచ్చినప్పటికీ, ఇప్పుడు నాగవంశీ ఈ చిత్రాన్ని మైథలాజికల్‌గా ధృవీకరించడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. బన్నీ పాత్ర, లుక్ ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇదే సమయంలో ఎక్స్‌లో బన్నీ కుమారస్వామిగా ఉన్న ఫ్యాన్-మెడ్ జీబ్లీ ఇమేజ్‌లు ట్రెండింగ్‌లోకి వచ్చాయి.

వివరాలు 

'కేజీయఫ్' స్థాయిలో 'కింగ్‌డమ్'! 

ఈ ప్రెస్‌మీట్‌లో విజయ్ దేవరకొండ నటిస్తున్న 'కింగ్‌డమ్' గురించి కూడా నాగవంశీ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు 'కేజీయఫ్' స్థాయిలో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఈ సినిమాకు యాక్షన్ ప్రధాన ఆకర్షణ అని, అన్ని లాజిక్‌లు సరిగ్గా కుదరాలని దర్శకుడు గౌతమ్ చాలా కష్టపడుతున్నారని చెప్పారు. ఇదే సందర్భంలో, రవితేజ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'మాస్ జాతర' చిత్రం ప్రారంభించుకున్న సమయానికి విడుదల కాకపోవచ్చని నాగవంశీ తెలిపారు. అయితే, జూలైలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.