
సల్మాన్ ఖాన్ సినిమాలో అల్లు అర్జున్ క్యామియో: పుష్ప గెటప్ తో దొరికేసిన బన్నీ?
ఈ వార్తాకథనం ఏంటి
పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ పేరు ఇండియా మొత్తం మోగిపోయింది. ఐకాన్ స్టార్ రేంజ్ అమాంతం మారిపోయింది. అందుకే పుష్ప 2 కోసం జనాలందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
అయితే పుష్ప 2 కంటే ముందుగానే వెండితెర మీద అల్లు అర్జున్ కనిపించబోతున్నాడని అంటున్నారు. సల్మాన్ ఖాన్ నటిస్తున్న సినిమాలో అల్లు అర్జున్ ప్రత్యేక అతిథిగా కనిపించనున్నారని వినిపిస్తోంది.
కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ అనే చిత్రంలో, ఏంటమ్మా అనే పాటలో అల్లు అర్జున్ కనిపిస్తారని చెబుతున్నారు. ఆ పాట తాలూకు ప్రోమో నిన్న రిలీజ్ కావడంతో, అందులో ముఖం కనిపించకుండా ఉన్న పర్సన్ అల్లు అర్జున్ అని అంటున్నారు.
కిసీ కా భాయ్ కిసీ కీ జాన్
బాలీవుడ్ సినిమాకు దక్షిణాది హంగులు
అల్లు అర్జున్ ముఖం కనిపించకపోయినా, పుష్ప గెటప్ లో ఉన్నట్లు లాంగ్ హెయిర్ కనిపించడంతో, ఖచ్చితంగా అల్లు అర్జున్ అయ్యుంటాడని అంటున్నారు. ఈ పాట పూర్తి వీడియో ఈరోజు రిలీజ్ కానుంది.
కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో చేస్తున్నారు. ఆల్రెడీ రిలీజైన టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది.
ఆల్రెడీ ఈ సినిమా నుండి బతుకమ్మ పాట రిలీజైంది. దక్షిణాది సంస్కృతి ఎక్కువగా కనిపిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.
సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఫర్హద్ సమ్జీ డైరెక్ట్ చేస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఏంటమ్మా పాట రేపు వస్తోందంటూ ట్వీట్ చేసిన సల్మాన్
#Yentamma song coming tomorrow.https://t.co/He7EvZ60OF@hegdepooja @VenkyMama @farhad_samji @VishalDadlani @iPayalDev @raftaarmusic @Musicshabbir @AlwaysJani
— Salman Khan (@BeingSalmanKhan) April 3, 2023