తదుపరి వార్తా కథనం

కొడుకు అయాన్ బర్త్ డే సందర్భంగా క్యూట్ ఫోటోను షేర్ చేసిన అల్లు అర్జున్
వ్రాసిన వారు
Sriram Pranateja
Apr 03, 2023
04:08 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కొడుకు అయాన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసాడు.
కొడుకు అయాన్ ను ఆప్యాయంగా హత్తుకున్న ఫోటోను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేస్తూ, జీవితం మీద నా ప్రేమకు ప్రతిరూపంగా ఉన్న చిన్నిబాబుకు హ్యాపీ బర్త్ డే అంటూ విషెస్ తెలియజేసాడు.
ఇదే ఫోటోను అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహ కూడా తన సోషల్ అకౌంట్ లో షేర్ చేసింది. ఈ క్యూట్ ఫోటోపై నెటిజన్స్ స్పందిస్తూ, అల్లు అయాన్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
అల్లు అర్జున్ కు కూతురు కూడా ఉంది. తన పేరు అల్లు అర్హ. ప్రస్తుతం శాకుంతలం సినిమాతో బేబీ అర్హ వెండితెరకు పరిచయం అవుతుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అల్లు అయాన్ కు బర్త్ డే విషెస్ తెలిపిన అల్లు అర్జున్
Happy Birthday to the love of my life. My sweetest chinni babu #AlluAyaan pic.twitter.com/swwINNA4yO
— Allu Arjun (@alluarjun) April 3, 2023