శాకుంతలం ప్రమోషన్లు మొదలు: వీడియో సాంగ్ తో కొత్తలోకంలోకి తీసుకెళ్ళిన గుణశేఖర్
సమంత హీరోయిన్ గా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్న చిత్రం శాకుంతలం. సమంత కెరీర్లో మొదటి పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ చిత్రం నుండి వీడియో సాంగ్ రిలీజైంది. కనిపిస్తున్న భారీ బడ్జెట్: మల్లికా మల్లికా అంటూ సాగే పాట వీడియోను ప్రమోషన్లలో భాగంగా రిలీజ్ చేసారు. ఈ పాటలో సమంత అందంగా మెరిసిపోతోంది. పాట చాలా రిచ్ గా ఉంది. పచ్చని వాతావరణం, కొలనులో హంసలు, పారే కాలువలు, అల్లుకున్న లతలు.. అన్నీ కలిసి పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చాయి. సమంత కెరీర్లోనే భారీ బడ్జెట్ గా రూపొందిందన్న మాటలు, ఈ వీడియో సాంగ్ తో నిజమని నమ్మేలా చేస్తున్నాయి. ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తుంది.