పుష్పలోని ఊ అంటావా ఐటెం సాంగ్ కావాలనే చేసానంటూ కారణం చెప్పిన సమంత
శాకుంతలం ప్రమోషన్లలో బిజీగా ఉన్న సమంత, వరుసగా ఇంటర్వ్యూల్లో పాల్గొంటుంది. మీడియాతో రకరకాల విషయాలు ముచ్చటిస్తున్న సమంత, పుష్పలో ఐటెం సాంగ్ ఎందుకు చేసిందో కారణం తెలియజేసింది. వివాహ బంధాన్ని వదులుకున్న తర్వాత పుష్ప సినిమా నుండి ఐటెం సాంగ్ ఆఫర్ వచ్చిందని, వెంటనే ఒప్పేసుకున్నానని ఆమె అంది. ఏ తప్పు చేయలేదని తెలిసినపుడు ఇంట్లోనే కూర్చోవాల్సిన అవసరం ఏముందని, అందుకే ఆ పాట ఒప్పుకున్నానని అంది. అంతేకాదు, తన సన్నిహితులు, కుటుంబ సభ్యులు.. ఊ అంటావా పాట చేయవద్దని సలహా ఇచ్చారనీ, విడిపోయిన వెంటనే ఇలాంటి పాటలు చేస్తే బాగుండదని సమంతకు సలహా ఇచ్చారట. కానీ అందుకు అంగీకరించకుండా పాటలో నటించడానికి ఒప్పుకున్నట్లు తెలిపింది.
వివాహ బంధంలో వందశాతం నిజాయితీగా ఉన్నానంటున్న సమంత
వివాహ బంధంలో 100శాతం నిజయితీగా ఉన్నాననీ, కానీ అది వర్కౌట్ కాలేదనీ, చేయని నేరానికి ఎందుకు శిక్ష అనుభవించాలనీ, అందుకే దాక్కోవడం ఇష్టం లేక పాటను ఒప్పుకున్నట్లు తెలియజేసింది. వివాహ బంధం గురించే కాకుండా తన అనారోగ్యంపై అనేక విషయాలను బయటపెట్టింది సమంత. మయోసైటిస్ కారణంగా తన మీద తనకు కంట్రోల్ తప్పిందని ఆమె తెలిపింది. అందుకే అప్పుడప్పుడూ లావుగా, నీరసంగా కనిపిస్తున్నానని అంది. అలాగే తన కళ్ళలో డైరెక్టుగా వెలుగు పడకూడదనీ, అందుకే రెగ్యులర్ గా కళ్ళద్దాలు పెట్టుకుని కనబడుతున్నానని, ఇలా 8నెలలుగా రోజూ అనారోగ్యం మీద పోరాటం చేస్తున్నానని అంది సమంత. శాకుంతలం సినిమా ఏప్రిల్ 14వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.
ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి