Page Loader
Allu Arjun: అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణ.. వైరల్ అవుతున్న ఫోటోలు.. 

Allu Arjun: అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణ.. వైరల్ అవుతున్న ఫోటోలు.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 29, 2024
09:51 am

ఈ వార్తాకథనం ఏంటి

పుష్ప సినిమాతో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. పుష్ప సినిమా రికార్డులను బ్రేక్ చేసింది. పాటలు,డైలాగ్స్,మేనరిజమ్స్ హిట్ అవ్వడంతో అల్లు అర్జున్ ప్రపంచంలోని పలు దేశాల్లో కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా నేషనల్ అవార్డులను కూడా అందుకుంది. ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచంలోనే అతి పెద్ద మ్యూజియం దుబాయ్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో అల్లు అర్జున్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గత సంవత్సరం మ్యూజియం నిర్వాహకులు అల్లు అర్జున్ దగ్గరికి వచ్చి కొలతలు తీసుకున్నారు. గురువారం,ఈ విగ్రహాన్ని గ్రాండ్ గా ఓపెన్ చేసి తన మైనపు విగ్రహంతో సెల్ఫీలు దిగాడు అల్లు అర్జున్.

అల్లు అర్జున్ 

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విగ్రహం వీడియో

ఆ విగ్రహం వీడియోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసి.. తగ్గేదేలే అంటూ ట్యాగ్ చేశాడు. ఆ విగ్రహ ఆవిష్కరణ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఎరుపు రంగు బ్లేజర్‌ , నలుపు ప్యాంటు, ఫార్మల్ షూస్‌తో మైనపు ప్రతిరూపం బ్లాక్‌బస్టర్ చిత్రం 'అలా వైకుంఠపురంలో' నుండి అల్లు అర్జున్ ఐకానిక్ రూపాన్ని ప్రతిబింబిస్తుంది. ఇక సినిమాల విషయానికొస్తే.. పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు.. ఆ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అల్లు అర్జున్ చేసిన ట్వీట్