Loading...
Allu Arjun: అల్లు ఆర్మీకి షాకింగ్ న్యూస్! బన్నీతో సినిమా ఉంటుందా? ఉండదా? సందీప్ బ్రదర్ కామెంట్స్ వైరల్!
అల్లు ఆర్మీకి షాకింగ్ న్యూస్! బన్నీతో సినిమా ఉంటుందా? ఉండదా? సందీప్ బ్రదర్ కామెంట్స్ వైరల్!

Allu Arjun: అల్లు ఆర్మీకి షాకింగ్ న్యూస్! బన్నీతో సినిమా ఉంటుందా? ఉండదా? సందీప్ బ్రదర్ కామెంట్స్ వైరల్!

వ్రాసిన వారు Moogati Shabari
Aug 22, 2026
05:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో సినిమా కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ కాంబినేషన్‌లో భారీ ప్రాజెక్ట్‌ను గతంలోనే ప్రకటించడంతో సినిమాపై అంచనాలు కూడా భారీగా ఏర్పడ్డాయి. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్‌పై ఓ అనూహ్యమైన వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సందీప్ రెడ్డి వంగా సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా చేసిన తాజా కామెంట్స్ ఈ ప్రాజెక్ట్‌పై అనుమానాలను పెంచుతున్నాయి. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా ప్రభాస్‌తో 'స్పిరిట్' సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత 'యానిమల్'కు సీక్వెల్‌గా 'యానిమల్ పార్క్' ఉంటుందని ప్రణయ్ రెడ్డి వంగా వెల్లడించారు.

వివరాలు

ప్రత్యేకమైన బ్రాండ్‌..

మహేష్ బాబుతో కూడా ఓ సినిమా చేసే అవకాశం ఉందనే హింట్ ఇచ్చారు.

అయితే అల్లు అర్జున్‌తో గతంలో ప్రకటించిన సినిమా గురించి ప్రశ్నించగా.. ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ ఉంటుందని కచ్చితంగా చెప్పలేనని ఆయన పేర్కొన్నట్లు తెలుస్తోంది.

దీంతో బన్నీ-సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ హోల్డ్‌లో పడిందా? అసలు ఈ సినిమా ఉంటుందా? లేదా? అనే చర్చ మొదలైంది.

ఒకవేళ ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లకపోతే అల్లు అర్జున్ అభిమానులకు నిరాశ తప్పదనే చెప్పాలి.

ముఖ్యంగా 'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్', 'యానిమల్' వంటి సినిమాలతో సందీప్ రెడ్డి వంగా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్నారు. దీంతో ఈ కాంబినేషన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

వివరాలు

అట్లీ దర్శకత్వంలో రాకా..

ఇక ప్రస్తుతం అల్లు అర్జున్.. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రాకా' ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నారు.

ఆ తర్వాత లోకేశ్ కనగరాజ్‌తో కూడా ఓ సినిమాను ప్రకటించారు. అలాగే ఇతర భాషలకు చెందిన పలువురు దర్శకులతోనూ బన్నీ వరుస ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో బన్నీ-సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ భవిష్యత్తు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

సందీప్ రెడ్డి వంగా తన తదుపరి ప్రాజెక్టుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.. అల్లు అర్జున్‌తో ప్రకటించిన సినిమా మళ్లీ పట్టాలెక్కుతుందో లేదో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

ADVERTISEMENT