Loading...
Chiranjeevi Birthday: కష్టాల నుంచి కీర్తి శిఖరాలకు.. మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రయాణం
కష్టాల నుంచి కీర్తి శిఖరాలకు.. మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రయాణం

Chiranjeevi Birthday: కష్టాల నుంచి కీర్తి శిఖరాలకు.. మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రయాణం

వ్రాసిన వారు Moogati Shabari
Aug 22, 2026
09:16 am

ఈ వార్తాకథనం ఏంటి

చిరంజీవి.. ఈ పేరు వినగానే ఓ మాస్ ఇమేజ్ కళ్లముందు మెదులుతుంది. తెరపై ఆయన వేసే ఒక్క స్టెప్‌కు థియేటర్లు ఊగిపోతాయి. ఆయన చెప్పే ఒక్క డైలాగ్‌కు అభిమానులు పండగ చేసుకుంటారు. నాలుగు దశాబ్దాలకు పైగా సాగుతున్న ఆయన సినీ ప్రయాణంలో ఎన్నో రికార్డులు, అవార్డులు, అరుదైన ఘనతలు సొంతమయ్యాయి. నటుడిగా ప్రారంభమైన ప్రయాణం మెగాస్టార్ స్థాయికి చేర్చింది. సినిమాలతో పాటు సేవా కార్యక్రమాల ద్వారా కూడా చిరంజీవి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవిత ప్రయాణంపై ప్రత్యేక కథనం.

వివరాలు

1976లో మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ..

చిరంజీవి అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. 1955 ఆగస్టు 22న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు జన్మించారు.

నాగబాబు, పవన్ కల్యాణ్ ఆయన సోదరులు. తండ్రి వెంకట్రావు పోలీసు శాఖలో పనిచేసేవారు.

ఉద్యోగరీత్యా కుటుంబం పలు ప్రాంతాల్లో నివసించడంతో చిరంజీవి విద్యాభ్యాసం కూడా వివిధ ప్రాంతాల్లో సాగింది.

చిన్నతనం నుంచే నటనపై ఆసక్తి పెంచుకున్న ఆయన.. కాలేజీ రోజుల్లో నాటకాల్లో నటించేవారు.

నటుడిగా మారాలనే లక్ష్యంతో 1976లో మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందారు. అక్కడ తన నటనా ప్రతిభకు మరింత పదును పెట్టుకున్నారు.

వివరాలు

'పునాదిరాళ్లు'తో తొలి అడుగు..

సినిమా రంగంలో చిరంజీవి తొలి అడుగు 'పునాదిరాళ్లు'తో పడింది.

అయితే ఈ సినిమా కంటే ముందే ఆయన నటించిన 'ప్రాణం ఖరీదు' ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

1978లో విడుదలైన ఈ సినిమాతో చిరంజీవి సినీ ప్రస్థానం ప్రారంభమైంది.

తొలి రోజుల్లో విలన్, క్యారెక్టర్ తరహా పాత్రల్లో నటించారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

1982లో వచ్చిన 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య' చిరంజీవి కెరీర్‌లో కీలక మలుపుగా నిలిచింది.

ఈ సినిమాతో పూర్తి స్థాయి హీరోగా ప్రేక్షకుల్లో బలమైన గుర్తింపు సంపాదించారు.

అదే ఏడాది విడుదలైన 'శుభలేఖ' ఆయనలోని నటుడికి మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది.

ADVERTISEMENT

వివరాలు

జాతీయ స్థాయిలో గుర్తింపు..

1983లో వచ్చిన 'ఖైదీ' చిరంజీవి కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో ఆయన మాస్ ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

ఆ తర్వాత వరుస విజయాలతో అగ్ర కథానాయకుడిగా ఎదిగారు. అభిమానుల గుండెల్లో 'మెగాస్టార్'గా చెరగని స్థానం సంపాదించుకున్నారు.

చిరంజీవి తన నటనకు ఎన్నో ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్నారు.

పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి దేశ అత్యున్నత పౌర పురస్కారాలతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి పలు నంది అవార్డులు అందుకున్నారు.

భారతీయ సినిమా రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా అందుకున్నారు.

ADVERTISEMENT

వివరాలు

రాజకీయాల్లోకి ఎంట్రీ..

సినిమాల్లో అగ్రస్థానంలో ఉన్న సమయంలో చిరంజీవి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.

2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. ప్రజా సమస్యలపై తనదైన ఆలోచనలతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు.

అనంతరం ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు.

రాజకీయ ప్రస్థానం తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న చిరంజీవి.. 'ఖైదీ నంబర్ 150'తో ఘనంగా రీఎంట్రీ ఇచ్చారు.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత 'సైరా నరసింహారెడ్డి', 'ఆచార్య', 'గాడ్‌ఫాదర్', 'వాల్తేరు వీరయ్య', 'భోళా శంకర్', 'విశ్వంభర' వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు.

ప్రస్తుతం కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంటూ యువ హీరోలకు పోటీగా తన జోరు కొనసాగిస్తున్నారు.

వివరాలు

చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్..

చిరంజీవి పేరు చెప్పగానే గుర్తొచ్చే మరో ముఖ్యమైన అంశం ఆయన సేవా కార్యక్రమాలు. 1998లో చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి రక్తదానం, నేత్రదానం వంటి కార్యక్రమాలను ప్రోత్సహించారు.

చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా అవసరమైన వారికి రక్తాన్ని అందించడంతో పాటు నేత్రదానంపై అవగాహన కల్పించారు.

2006లో అప్పటి రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం కూడా ఈ ట్రస్ట్‌ను సందర్శించారు.

కరోనా సమయంలోనూ చిరంజీవి తన వంతు సాయం చేశారు.

సినీ కార్మికులకు నిత్యావసర సరుకులు, ఆర్థిక సహాయం అందించడంతో పాటు కరోనా క్రైసిస్ ఛారిటీ (CCC) ద్వారా సినీ కార్మికులకు అండగా నిలిచారు.

ADVERTISEMENT