Loading...
Allu arjun: ఫోర్బ్స్ ఇండియా 'షో స్టాపర్స్ 2026' కవర్‌పై అల్లు అర్జున్
ఫోర్బ్స్ ఇండియా 'షో స్టాపర్స్ 2026' కవర్‌పై అల్లు అర్జున్

Allu arjun: ఫోర్బ్స్ ఇండియా 'షో స్టాపర్స్ 2026' కవర్‌పై అల్లు అర్జున్

వ్రాసిన వారు Moogati Shabari
Aug 27, 2026
04:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

గ్లోబల్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి అంతర్జాతీయ స్థాయిలో తన ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రముఖ మ్యాగజైన్ ఫోర్బ్స్ ఇండియా తాజాగా విడుదల చేసిన ప్రత్యేక సంచిక 'షో స్టాపర్స్ 2026' కవర్ పేజీపై అల్లు అర్జున్ మెరిశారు. ఈ సందర్భంగా సినిమా పరిశ్రమలో వస్తున్న మార్పులు, కథల ప్రాధాన్యతపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్, టాలీవుడ్ లేదా మరే ప్రాంతీయ చిత్ర పరిశ్రమ అయినా.. బాక్సాఫీస్ వద్ద సినిమా విజయానికి కేవలం హీరో, హీరోయిన్ల స్టార్‌డమ్ సరిపోదని అల్లు అర్జున్ అభిప్రాయపడ్డారు. మంచి కథ, బలమైన కంటెంట్‌నే సినిమాకు ప్రధాన బలం అని పేర్కొన్నారు. ప్రేక్షకులకు సరికొత్త కథలను అందించగలిగితే భాషతో సంబంధం లేకుండా ఏ సినిమాఅయినా విజయం సాధిస్తుందని చెప్పారు.

వివరాలు

100 మంది ప్రముఖులతో ఫోర్బ్స్ ఇండియా 'షో స్టాపర్స్ 2026' జాబితా..

సినిమా విజయాన్ని నిర్ణయించడంలో కథే కీలకమని, ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచులు కూడా గణనీయంగా మారుతున్నాయని అల్లు అర్జున్ వ్యాఖ్యానించారు.

అందుకే కొత్త ఆలోచనలు, వైవిధ్యమైన కథలతో ప్రేక్షకుల ముందుకు రావడం చాలా ముఖ్యమని అన్నారు.

ఇక 2025 జనవరి నుంచి 2026 మార్చి వరకు సినిమా, ఓటీటీ, క్రీడలు, సంగీతం, టెలివిజన్ తదితర రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచి ప్రభావం చూపిన 100 మంది ప్రముఖులతో ఫోర్బ్స్ ఇండియా 'షో స్టాపర్స్ 2026' జాబితాను రూపొందించింది.

వివరాలు

అభిమానుల్లో మరింత ఆసక్తి..

ఈ ప్రతిష్ఠాత్మక జాబితాలో అల్లు అర్జున్‌తో పాటు అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, మోహన్‌లాల్, రామ్ చరణ్, షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్, ఏఆర్ రెహమాన్, బాబీ డియోల్, దుల్కర్ సల్మాన్, మాధవన్, రణ్‌వీర్ సింగ్, రిషబ్ శెట్టి, కల్యాణి ప్రియదర్శన్, కంగనా రనౌత్ తదితర ప్రముఖులు చోటు దక్కించుకున్నారు.

'పుష్ప' చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో భారీ క్రేజ్‌ సొంతం చేసుకున్న అల్లు అర్జున్.. ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.

అంతర్జాతీయ వేదికలపై కూడా గుర్తింపు పొందుతున్న ఆయనకు 'షో స్టాపర్స్ 2026' కవర్‌పై చోటు దక్కడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.

ADVERTISEMENT