Loading...
Allu Arjun : నా కల్లో కూడా అనుకోలేదు.. AAA వైజాగ్ ఓపెనింగ్‌లో అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్
నా కల్లో కూడా అనుకోలేదు.. AAA వైజాగ్ ఓపెనింగ్‌లో అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్

Allu Arjun : నా కల్లో కూడా అనుకోలేదు.. AAA వైజాగ్ ఓపెనింగ్‌లో అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్

వ్రాసిన వారు Moogati Shabari
Aug 09, 2026
04:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

విశాఖపట్నం వేదికగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినీ ప్రియులకు అదిరిపోయే కానుక అందించారు. ప్రముఖ వ్యాపారవేత్త ఆసియన్ సునీల్‌తో కలిసి అత్యాధునిక సాంకేతికతతో నిర్మించిన 'ఏఏఏ (AAA) సినిమాస్' మల్టీప్లెక్స్‌ను అల్లు అర్జున్ స్వయంగా ప్రారంభించారు. వైజాగ్ ఇనార్బిట్ మాల్ ప్రాంగణంలో కొలువుదీరిన ఈ మల్టీప్లెక్స్ గ్రాండ్ లాంచ్ వేడుక ఘనంగా జరిగింది. అభిమానుల సందడి, హర్షధ్వానాల మధ్య అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

వివరాలు

విడదీయరాని అనుబంధం..

ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి మాట్లాడిన బన్నీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

విశాఖపట్నం తనకు ఎంతో ప్రత్యేకమైన నగరమని చెప్పారు.

తన సినీ ప్రయాణంతో ఈ నగరానికి విడదీయరాని అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నారు.

వివరాలు

డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్..

"వైజాగ్ నాకు ఎంతో ప్రత్యేకమైన ఊరు. నా తొలి సినిమా 'గంగోత్రి' షూటింగ్ సమయంలో ఈ నగరంలోని వీధుల్లో నడిచినప్పుడు నన్ను ఎవరూ గుర్తుపట్టేవారు కూడా కాదు.

కానీ ఇప్పుడు ఇక్కడికి వస్తే అభిమానులు చూపించే ప్రేమ, ఆప్యాయతతో నడవలేనంతగా ఆదరిస్తున్నారు.

అప్పట్లోనే ఈ నగరంలో ఓ భారీ మాల్ వస్తుందని, అందులో నా సొంత ప్రెస్టీజియస్ మల్టీప్లెక్స్ అందుబాటులోకి వస్తుందని నా కల్లో కూడా ఊహించలేదు.

ఇది నిజంగా డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్" అని అల్లు అర్జున్ అన్నారు.

ADVERTISEMENT