Loading...
Allu arjun: 'రాకా'లో అల్లు అర్జున్‌ త్రిపాత్రాభినయం.. ఆ పాత్రలో నెగెటివ్‌ షేడ్స్‌!
'రాకా'లో అల్లు అర్జున్‌ త్రిపాత్రాభినయం.. ఆ పాత్రలో నెగెటివ్‌ షేడ్స్‌!

Allu arjun: 'రాకా'లో అల్లు అర్జున్‌ త్రిపాత్రాభినయం.. ఆ పాత్రలో నెగెటివ్‌ షేడ్స్‌!

వ్రాసిన వారు Moogati Shabari
Aug 29, 2026
12:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

అల్లు అర్జున్‌ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ 'రాకా' ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌తోనే బన్నీ అభిమానులను చిత్రబృందం సర్‌ప్రైజ్‌ చేసింది. దీంతో సినిమాలో అల్లు అర్జున్‌ పాత్ర ఎలా ఉండబోతుందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఇప్పటివరకు ఆయన తండ్రీకొడుకులుగా డ్యూయల్‌ రోల్‌లో కనిపించనున్నారని, అందులో ఓ పాత్రకు పూర్తి నెగెటివ్‌ షేడ్స్‌ ఉంటాయని ప్రచారం జరిగింది.

వివరాలు

మూడు విభిన్న పాత్రల్లో బన్నీ..

అయితే తాజా సమాచారం ప్రకారం.. 'రాకా'లో అల్లు అర్జున్‌ మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారట.

కేవలం గెటప్స్‌ మాత్రమే కాకుండా.. ఈ మూడు పాత్రల వ్యక్తిత్వాలు కూడా ఒకదానికొకటి పూర్తి భిన్నంగా ఉంటాయని తెలుస్తోంది.

ఇందులో ఓ పాత్ర పూర్తిగా నెగెటివ్‌ షేడ్స్‌తో సాగుతుందని, ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌లో చూపించింది అదే పాత్రేనని సమాచారం.

వివరాలు

పురాణ కాలం, వర్తమాన కాలం నేపథ్యంలో కథ..

పునర్జన్మ అంశాన్ని ప్రధానంగా తీసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

పురాణ కాలం, వర్తమాన కాలం నేపథ్యంలో కథ సాగనుండగా.. భారీ విజువల్‌ హంగులతో సినిమాను రూపొందిస్తున్నారు.

సైన్స్‌ ఫిక్షన్‌ అంశాలకు పురాణ నేపథ్యాన్ని జోడించి అట్లీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

వచ్చే ఏడాది ద్వితీయార్థంలో 'రాకా' ప్రేక్షకుల ముందుకు రానుంది.

ADVERTISEMENT