Page Loader
Allu Arjun: అరెస్ట్‌ తర్వాత చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్
అరెస్ట్‌ తర్వాత చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్

Allu Arjun: అరెస్ట్‌ తర్వాత చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 15, 2024
12:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్టార్ నటుడు అల్లు అర్జున్‌ తన మేనమామ చిరంజీవి ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. బన్నీ తన కుటుంబ సభ్యులతో కలిసి చిరంజీవి నివాసానికి చేరుకున్నారు. 'పుష్ప 2' సినిమా బెనిఫిట్‌ షో సమయంలో సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో జైలు నుంచి విడుదలైన తర్వాత చిరంజీవిని కలుసుకున్నాడు. శుక్రవారం ఉదయం పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఆ రాత్రంతా ఆయన చంచల్‌గూడ జైలులో అల్లు అర్జున్ ఉన్నారు.

Details

భావోద్వేగానికి గురైన సురేఖ

హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడంతో శనివారం ఉదయం ఆయన జైలులో నుంచి విడుదలయ్యారు. అల్లు అర్జున్ అరెస్టు జరిగిన తర్వాత చిరంజీవి సతీమణి సురేఖ భావోద్వేగానికి గురయ్యారు. అర్జున్‌ అరెస్ట్‌ అయ్యాడని తెలుసుకుని ఎంతో కంగారు పడ్డామని, చిరంజీవి కూడా షూటింగ్‌ క్యాన్సిల్‌ చేసుకుని వచ్చారని సురేఖ చెప్పారు. అల్లు అర్జున్‌ జైలులో ఉండగా, చిరంజీవి, సురేఖ దంపతులు బన్నీని పరామర్శించేందుకు ఆయన నివాసానికి చేరుకున్న విషయం తెలిసిందే.