LOADING...
Allu Sirish Marriage : చిరంజీవికి తొలి ఆహ్వానం అందించిన అల్లు శిరీశ్.. చేతి కట్టుతో కనిపించిన మెగాస్టార్
చిరంజీవికి తొలి ఆహ్వానం అందించిన అల్లు శిరీశ్.. చేతి కట్టుతో కనిపించిన మెగాస్టార్

Allu Sirish Marriage : చిరంజీవికి తొలి ఆహ్వానం అందించిన అల్లు శిరీశ్.. చేతి కట్టుతో కనిపించిన మెగాస్టార్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 16, 2026
11:27 am

ఈ వార్తాకథనం ఏంటి

అల్లు కుటుంబంలో పెళ్లి సందడి మొదలైంది. నిర్మాత అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరిష్ వచ్చే నెల 6న వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఆయన వివాహం నయనిక రెడ్డితో జరగనుంది. ఈ సందర్భంగా పెళ్లికి సంబంధించిన తొలి శుభలేఖను అల్లు కుటుంబం మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి అందజేసింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను శిరీశ్ స్వయంగా సోషల్ మీడియాలో పంచుకున్నారు. పెళ్లి ఆహ్వానం అందించేందుకు అల్లు అరవింద్, ఆయన సతీమణి నిర్మల, కుమారుడు శిరీశ్ కలిసి ఆదివారం చిరంజీవి నివాసానికి వెళ్లారు. తెలుగు సంప్రదాయం ప్రకారం పట్టు వస్త్రాలతో పాటు వెడ్డింగ్ కార్డును అందజేశారు.

Details

గాయంతో కనిపించిన చిరంజీవి

చిరంజీవి తన సతీమణి సురేఖ కొణిదెలతో కలిసి ఆహ్వాన పత్రికను స్వీకరించారు. తెలుగు సంప్రదాయం ప్రకారం నా పెళ్లి తొలి ఆహ్వాన పత్రికను మా మామయ్య చిరంజీవి, అత్తయ్య సురేఖకు అందించామని శిరీశ్ పేర్కొన్నారు. అయితే ఈ ఫొటోలో చిరంజీవి ఎడమ చేతికి కట్టు కనిపించడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఒకే చేతితో ఆహ్వాన పత్రికను స్వీకరిస్తున్నట్లు ఫొటోలో స్పష్టమవుతోంది. ఆయనకు గాయం ఎలా అయిందన్నది ఇంకా తెలియరాలేదు. ఇటీవల రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవలలు జన్మించినప్పుడు చిరంజీవి ఆసుపత్రికి వెళ్లిన సందర్భంలో చేతికి ఎలాంటి కట్టు కనిపించలేదు.

Details

వచ్చే నెల 6న వివాహం

దీంతో ఈ మధ్యకాలంలోనే ఆయనకు గాయం అయి ఉండవచ్చని అభిమానులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, అల్లు శిరీశ్-నయనిక రెడ్డి వివాహం వచ్చే నెల 06న ఘనంగా నిర్వహించనున్నారు. పెళ్లి ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇటీవల అల్లు అరవింద్ ఇంట్లో 'పసుపు దంచడం' కార్యక్రమం సాంప్రదాయబద్ధంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కొణిదెల సురేఖ, రామ్ చరణ్ సతీమణి ఉపాసన, చిరంజీవి కుమార్తె సుస్మిత, అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి తదితరులు హాజరై సందడి చేశారు. ఆ వేడుకకు సంబంధించిన వీడియోను కూడా శిరీశ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.

Advertisement