Allu Sirish : పెళ్లికి ముందే అల్లు శిరీష్ గ్రాండ్ పార్టీ.. టాలీవుడ్ ప్రముఖుల సందడి!
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ తన వివాహ వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే మార్చి 6న నయనికతో ఏడు అడుగులు వేయనున్నట్లు ప్రకటించిన ఆయన, పెళ్లికి ముందే ప్రత్యేక వేడుకను ప్లాన్ చేశారు. తాజా వివరాల ప్రకారం మార్చి 2న అల్లు స్టూడియోస్‌లో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ నిర్వహించనున్నట్లు శిరీష్ స్వయంగా వెల్లడించారు. ఈ కార్యక్రమానికి తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరుకానున్నారని తెలిపారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఈ సంబరాలు జరగనున్నాయి. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ పేరుతో నిర్వహిస్తున్న ఈ వేడుక టాలీవుడ్ ప్రముఖులకు ఇచ్చే గ్రాండ్ పార్టీగా మారనుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
Details
తమ్ముడి పెళ్లి సందర్భంగా అల్లు అర్జున్ ప్రత్యేకంగా పార్టీ
పెళ్లికి నాలుగు రోజుల ముందే ఇంత భారీగా కార్యక్రమం నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇదిలా ఉండగా, జనవరి 30, 31 తేదీల్లో దుబాయ్‌లో కూడా ఓ ప్రీ వెడ్డింగ్ వేడుక జరిగింది. ఆ వేడుకలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో పాటు పలువురు సన్నిహితులు పాల్గొన్నారు. ఇప్పుడు హైదరాబాద్‌లో మరోసారి అట్టహాసంగా వేడుక ప్లాన్ చేయడం చర్చనీయాంశమైంది. అంతేకాదు, ఇటీవల తమ్ముడి పెళ్లి సందర్భంగా అల్లు అర్జున్ ప్రత్యేకంగా పార్టీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో అల్లు కుటుంబంలో పెళ్లి సందడి మరింత ఊపందుకుంది. వివాహ వేడుకల భాగంగా అల్లు శిరీష్ తన తల్లిదండ్రులతో కలిసి మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా బ్రదర్ నాగబాబులను కలిసి శుభలేఖలు అందజేశారు.
Details
మార్చి 6న వివాహ వేడుక
ఆ సందర్భంగా తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గత ఏడాది డిసెంబర్ 28న నయనికతో తన వివాహం జరగనున్నట్లు అధికారికంగా ప్రకటించిన శిరీష్, ప్రస్తుతం పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. మార్చి 6న కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వివాహ వేడుక జరగనుంది. ఏది ఏమైనా పెళ్లికి ముందే టాలీవుడ్ ప్రముఖులను ఆహ్వానిస్తూ గ్రాండ్ పార్టీ ఇవ్వబోతున్న అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. అభిమానులు కూడా ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలు, వీడియోల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.