తదుపరి వార్తా కథనం
    
    
                                                                                Amala Paul Wedding: అమలా పాల్ రెండో పెళ్లి.. ఫొటోలు వైరల్
                వ్రాసిన వారు
                Stalin
            
            
                            
                                    Nov 05, 2023 
                    
                     08:08 pm
                            
                    ఈ వార్తాకథనం ఏంటి
Amala Paul Wedding: సౌత్ హీరోయిన్ నటి అమలా పాల్ తన ప్రియుడు జగత్ దేశాయ్‌ను ఆదివారం రహస్య పెళ్లి చేసుకుంది. కేరళలోని కొచ్చిలో అత్యంత సన్నిహితుల సమక్షంలో పెళ్లాడింది. అమలా పాల్, జగత్ దేశాయ్ ల వివాహం కొచ్చిలోని గ్రాండ్ హయత్ హోటల్‌లో జరిగింది. పెళ్లి తర్వాత, అమలా పాల్, జగత్ దేశాయ్ దిగిన పెళ్లి ఫొటోలను ఇద్దరూ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో షేర్ చేసారు. తాము పెళ్లి చేసుకున్న విషయాన్ని వెళ్లడించారు. తనకు ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని, ప్రేమతో ఆశీర్వదించండి అంటూ అమలా పాల్ తన పోస్టులో రాసుకొచ్చింది. అమలా పాల్ గతంలో దర్శకుడు ఏఎల్ విజయ్‌ని వివాహం చేసుకుంది. మూడేళ్ల తర్వాత ఇద్దరూ విడిపోయారు.