
ప్రాజెక్ట్ కె సినిమాపై అమితాబ్ ఆశ్చర్యం: ఇంత పెద్ద సినిమా అనుకోలేదంటూ ట్వీట్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కె సినిమాపై ఎంత హైప్ ఉందో అందరికీ తెలిసిందే. టాలీవుడ్ సీనియర్ దర్శకులు తమ్మారెడ్డి భరధ్వాజ మాట్లాడుతూ, ప్రాజెక్ట్ కె సినిమాకు ఒక్కరోజే 500కోట్లు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని అన్నారు.
అలాగే రానా దగ్గుబాటి కూడా ప్రాజెక్ట్ కె సినిమా కోసం వెయిట్ చేస్తున్నట్లు తెలియజేసారు. ఇలా వరుసగా సినిమా ఇండస్ట్రీ నుండి ప్రాజెక్ట్ కె సినిమా మీద వస్తున్న మాటలు అభిమానులు అందరిలో అంచనాలను పెంచేసాయి.
తాజాగా అమితాబ్ బచ్చన్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసారు. అమెరికాలోని శాని డియాగో నగరంలో జరగబోయే కామిక్ కాన్ ఇంటర్నేషనల్ ఈవెంట్ లో ప్రాజెక్ట్ కె టీమ్ పాల్గొంటున్న సంగతి తెలిసిందే.
ఈ విషయమై అమితాబ్ స్పందించారు.
Details
దర్శకుడికి ధన్యవాదాలు తెలియజేసిన అమితాబ్
కామిక్ కాన్ ఇంటర్నేషనల్ ఈవెంట్ లో ప్రాజెక్ట్ కె టీమ్ పాల్గొనడం గర్వంగా ఉందనీ, ప్రాజెక్ట్ కె ఇంత పెద్ద సినిమా అనుకోలేదనీ, ఇంత పెద్ద సినిమాలో తనను భాగం చేసినందుకు నాగ్ అశ్విన్ కు దన్యవాదాలు తెలియజేసారు అమితాబ్.
ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారుతోంది. ప్రభాస్ అభిమానులు అంతా ఉప్పొంగిపోతున్నారు. తాము అనుకున్న దానికంటే ప్రాజెక్ట్ కె పదిరెట్లు ఎక్కువగా ఉంటుందనీ, ఈసారి ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ పేరు మారుమోగుతుందని నమ్ముతున్నారు.
ప్రాజెక్ట్ కె సినిమాలో దీపికా పదుకొణె, దిశా పటాని, కమల్ హాసన్ నటిస్తున్నారు. 2024 జనవరి 12వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ప్రాజెక్ట్ కె గురించి అమితాబ్ చేసిన ట్వీట్
T 4697 - ... a proud moment for me .. I never realised how important and BIG this is ..
— Amitabh Bachchan (@SrBachchan) July 6, 2023
Now I know .. my wishes to Vyjayanthi Movies , Nag Sir and the entire unit for the affection they have given me , and to make me a part of this incredible experience 🙏 https://t.co/7c5vbQ0i5I