English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ప్రాజెక్ట్ కె కొత్త చరిత్ర: కామిక్ కాన్ ఇంటర్నేషనల్ ఈవెంట్ లో పార్టిసిపేషన్; గ్లింప్స్ విడుదల ఆరోజే 
    తదుపరి వార్తా కథనం
    ప్రాజెక్ట్ కె కొత్త చరిత్ర: కామిక్ కాన్ ఇంటర్నేషనల్ ఈవెంట్ లో పార్టిసిపేషన్; గ్లింప్స్ విడుదల ఆరోజే 
    కామిక్ కాన్ ఇంటర్నేషనల్ ఈవెంట్ లో పాల్గొననున్న ప్రాజెక్ట్ కె టీమ్

    ప్రాజెక్ట్ కె కొత్త చరిత్ర: కామిక్ కాన్ ఇంటర్నేషనల్ ఈవెంట్ లో పార్టిసిపేషన్; గ్లింప్స్ విడుదల ఆరోజే 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jul 07, 2023
    09:54 am

    ఈ వార్తాకథనం ఏంటి

    గతకొన్ని రోజులుగా ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కె సినిమా మీద వస్తున్న హైప్ అంతా ఇంతా కాదు. తెలుగు సినిమా ఖ్యాతిని మరింత పెంచే సినిమాగా, హాలీవుడ్ చిత్రాలకు పోటీనిచ్చే చిత్రంగా ప్రాజెక్ట్ కె అవుతుందని పలువురు సెలెబ్రిటీలు చెబుతూనే ఉన్నారు.

    ఆ మాటలకు తగినట్లుగానే ప్రాజెక్ట్ కె టీమ్ తీసుకుంటున్న నిర్ణయాలు ఉంటున్నాయి. తాజాగా ప్రాజెక్ట్ కె టీమ్, కామిక్ కాన్ ఇంటర్నేషనల్ ఈవెంట్ లో పాల్గొంటున్నట్టు అధికారికంగా తెలియజేసింది.

    అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం శాన్ డియాగో నగరంలో జరిగే కామిక్ కాన్ ఇంటర్నేషనల్ ఈవెంట్ లో జులై 20వ తేదీన ప్రాజెక్ట్ కె టీమ్ పాల్గోంటుంది.

    ఈ ఈవెంట్ లో పాల్గొనబోతున్న మొట్టమొదటి చిత్రంగా ప్రాజెక్ట్ కె నిలవబోతుంది.

    Details

    గ్లింప్స్ వీడియో రిలీజ్ అయ్యేది ఆరోజే 

    కామిక్ కాన్ ఇంటర్నేషనల్ ఈవెంట్ కి ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల నుండి సినిమా ప్రేమికులు, కామిక్స్ ని ఇష్టపడేవారు వస్తుంటారు.

    సుమారు లక్ష మంది ఈ ఈవెంట్ లో పాల్గొననున్నారని సమాచారం. జులై 19వ తేదీన సాయంత్రం పార్టీతో మొదలైన ఈవెంట్, జులై 23వ తేదీన ముగియనుంది.

    ఇందులో జులై 20వ తేదీన ప్రాజెక్ట్ కె నుండి ప్రభాస్, దీపికా పదుకునే, కమల్ హాసన్, నాగ్ అశ్విన్ పాల్గొంటారని తెలుస్తోంది.

    మరో విషయం ఏంటంటే, అదే రోజున ప్రాజెక్ట్ కె టైటిల్ రివీల్ తో పాటు ట్రైలర్ రిలీజ్ డేట్ ని కూడా రివీల్ చేయనున్నారట. అలాగే గ్లింప్స్ వీడియో రిలీజ్ అవుతుందని అంటున్నారు.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రాజెక్ట్ కె
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    Operation Sindoor: డ్రోన్ దాడుల‌కు కౌంటర్‌ అటాక్.. పాక్‌ ఎయిర్ బేస్‌లపై భారత్ దాడులు పాకిస్థాన్
    IMF: యుద్దం వేళ.. పాకిస్తాన్ కు IMF 1 బిలియన్ డాలర్ల రుణం మంజూరు..  పాకిస్థాన్
    Pak drone attacks: 20 నగరాలు లక్ష్యంగా పాకిస్తాన్ డ్రోన్ దాడులు.. సమర్థవంతంగా అడ్డుకున్న భారత సైన్యం.. ఆపరేషన్‌ సిందూర్‌
    Donald Trump: భారత్‌పై పాక్ డ్రోన్ల దాడి.. స్పందించిన డొనాల్డ్ ట్రంప్ డొనాల్డ్ ట్రంప్

    ప్రాజెక్ట్ కె

    వచ్చే సంక్రాంతికి ప్రభాస్, రజనీ కాంత్ పోటాపోటీ? తెలుగు సినిమా
    ప్రాజెక్ట్ కె షూటింగ్ లో అమితాబ్ కు ప్రమాదం, షూటింగ్ క్యాన్సిల్ సినిమా
    ప్రాజెక్ట్ కె: ఈ సారి విలన్లను పరిచయం చేసిన నాగ్ అశ్విన్ తెలుగు సినిమా
    ప్రాజెక్ట్ కె ప్లానింగ్ అదుర్స్: విలన్ గా కమల్ హాసన్?  తెలుగు సినిమా

    తెలుగు సినిమా

    విరూపాక్ష దర్శకుడికి ఖతర్నాక్ గిఫ్ట్ అందించిన నిర్మాతలు  సాయి ధరమ్ తేజ్
    వెంకటేష్ నటిస్తున్న సైంధవ్ సినిమా షూటింగ్ పై తాజా అప్డేట్  వెంకటేష్
    హత్య రిలీజ్ డేట్: విజయ్ ఆంటోనీ కొత్త సినిమా ఎప్పుడు రిలీజ్ కానుందంటే?  సినిమా రిలీజ్
    ఆదిపురుష్ ఓటీటీ రిలీజ్ కోసం ప్రత్యేకమైన రోజు: ఎప్పటి నుండి స్ట్రీమింగ్ అవుతుందంటే?  ఆదిపురుష్

    సినిమా

    ఆస్కార్ అవార్డ్స్ జ్యూరీ మెంబర్లుగా ఆర్ఆర్ఆర్ నుండి ఆరుగురు  ఆస్కార్ అవార్డ్స్
    పాప్ సింగర్ మడోన్నాకు అస్వస్థత: ఐసీయూలో ఉన్న హాలీవుడ్ గాయని  సినిమా
    తొలిప్రేమ క్లైమాక్స్ చూసి స్క్రీన్ పగలగొట్టేంత కోపం తెచ్చుకున్న అమితాబ్ బచ్చన్  పవన్ కళ్యాణ్
    30ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్న మంచు లక్ష్మీ  తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025