Loading...
Amitabh Bachchan: నేపాల్‌ వరదలపై అమితాబ్‌ బచ్చన్‌ ఆవేదన.. 'మనం చేయగలిగింది దేవుడిని ప్రార్థించడమే'
నేపాల్‌ వరదలపై అమితాబ్‌ బచ్చన్‌ ఆవేదన.. 'మనం చేయగలిగింది దేవుడిని ప్రార్థించడమే'

Amitabh Bachchan: నేపాల్‌ వరదలపై అమితాబ్‌ బచ్చన్‌ ఆవేదన.. 'మనం చేయగలిగింది దేవుడిని ప్రార్థించడమే'

వ్రాసిన వారు Moogati Shabari
Aug 29, 2026
04:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

నేపాల్‌లో సంభవించిన భారీ వరదలపై బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు అమితాబ్‌ బచ్చన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. వరదల కారణంగా చోటుచేసుకున్న ప్రాణ, ఆస్తి నష్టాలకు సంబంధించిన దృశ్యాలు తనను తీవ్రంగా కలచివేశాయని తెలిపారు. ఈ మేరకు తన బ్లాగ్‌లో భావోద్వేగ పోస్ట్‌ చేశారు.

వివరాలు

బాధిత కుటుంబాలకు అండగా నిలుద్దాం..

''నేపాల్‌లో వరదల విధ్వంసాన్ని చూడటం చాలా బాధగా ఉంది. ప్రకృతి కన్నెర్ర చేస్తే మనం తట్టుకోలేం.

ఇలాంటి విపత్తుల సమయంలో ఉపశమనం కోసం దైవానుగ్రహం ఎంతో అవసరం.

మనం చేయగలిగింది దేవుడిని ప్రార్థించడమే. ఆయన శక్తి అన్నింటికంటే గొప్పది'' అని అమితాబ్‌ బచ్చన్‌ పేర్కొన్నారు.

ఇటీవల నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది గల్లంతయ్యారు.

ఈ ఘటనపై పలువురు సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.

సంజయ్‌ దత్‌, సోనూసూద్‌, మనీషా కొయిరాలా, శింబు తదితరులు విచారం వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టారు. వరద బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని తెలిపారు.

ADVERTISEMENT