Loading...
Visakhapatnam: విశాఖలో విషాదం.. ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య
విశాఖలో విషాదం.. ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య

Visakhapatnam: విశాఖలో విషాదం.. ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 29, 2026
08:47 am

ఈ వార్తాకథనం ఏంటి

విశాఖపట్టణం జిల్లా పెందుర్తి పరిధిలోని చింతల అగ్రహారంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. కొత్తవలసకు చెందిన మల్ల ప్రవీణ్ కుమార్ కొంతకాలంగా జీవనోపాధి కోసం పెందుర్తిలోని ఓ అద్దె ఇంట్లో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ప్రవీణ్ కుమార్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తుండగా.. అతని భార్య కాయగూరల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈ దంపతులకు రెండేళ్లు, మూడేళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులు ఉన్నారు. రాఖీ పండుగ సందర్భంగా నిన్న కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడిపిన ప్రవీణ్ కుమార్.. కుటుంబ సభ్యులకు 'RIP' అంటూ సందేశం పంపినట్లు సమాచారం. ఆ తర్వాత ప్రవీణ్ కుమార్ ఆత్మహత్య చేసుకోగా.. అతని భార్య ఇద్దరు చిన్నారులతో కలిసి విషపదార్థం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

వివరాలు

ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

ఈ ఘటనపై సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ప్రవీణ్ కుమార్ భార్య, ఇద్దరు చిన్నారులను వెంటనే ఆస్పత్రికి తరలించారు.

అయితే అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

రాఖీ పండుగ రోజున కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపిన అనంతరం ఈ విషాద ఘటన చోటుచేసుకోవడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

ఈ ఘటనపై పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు ఆత్మహత్యకు కారణమై ఉండొచ్చా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఘటనకు దారితీసిన పూర్తి కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ADVERTISEMENT