
మహిళలను కించపరిచేలా బేబీ రిలీజ్ పోస్టర్: వివాదం చెలరేగడంతో సారీ చెప్పిన దర్శకుడు
ఈ వార్తాకథనం ఏంటి
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం బేబీ, జులై 14వ తేదీన విడుదల అవుతుందని చిత్రబృందం ఒక పోస్టర్ వదిలింది.
ఇప్పుడు ఆ పోస్టర్ కారణంగా బేబీ చిత్రం వివాదాల్లో ఇరుక్కుంది. రిలీజ్ డేట్ పోస్టర్ లో హీరోయిన్ ని మిడిల్ ఫింగర్ స్థానంలో చూపించడమే ఈ వివాదానికి కారణం.
ఈ పోస్టర్ రిలీజ్ చేసిన కొద్ది నిమిషాల్లోనే వైరల్ గా మారిపోయి కాంట్రవర్సీ క్రియేట్ అయ్యింది. పబ్లిసిటీ కోసం ఇలాంటి పోస్టర్లను ఎలా డిజైన్ చేస్తారంటూ నెటిజన్లు ప్రశ్నలు అడుగుతున్నారు.
ముఖ్యంగా స్త్రీ వాదులు ఈ పోస్టర్ పై గరం గరం ఉన్నారు. అయితే వివాదాం ఎక్కువైపోవడంతో దర్శకుడు సాయి రాజేష్ దిగి వచ్చారు.
Details
సోషల్ మీడియా హ్యాండిల్స్ నుండి రిలీజ్ పోస్టర్ తొలగింపు
రిలీజ్ పోస్టర్ ను వెనక్కి తీసుకుంటున్నట్లుగా, అలాగే సారీ చెబుతున్నట్లుగా దర్శకుడు సాయి రాజేష్ ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. పోస్టర్ ను కూడా వెనక్కి తీసుకుంటున్నామని సాయి రాజేష్ తెలియజేసాడు.
దీంతో అన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ నుండి వివాదాస్పద పోస్టర్ ని డిలీట్ చేసారు. కాకపోతే ఆల్రెడీ వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టింది కాబట్టి ఇంటర్నెట్ లో తిరుగుతూనే ఉంది.
బేబీ సినిమా నుండి రిలీజైన టీజర్ , పాటలకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. మంచి లవ్ స్టోరీని చూడబోతున్నామనే ఆశతో ఎంతోమంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
ఇలాంటి సమయంలో అనవసర వివాదాలు బేబీ సినిమాపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయోనని కొందరు నెటిజన్లు భావిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పోస్టర్ వివాదంపై సారీ చెప్పిన దర్శకుడు
Calling off the poster ...
— Sai Rajesh (@sairazesh) June 29, 2023
Apologies...
Its an Important sequence in the film…definitely not related to Movie theme. 😊