Anand Deverakonda : 'మా వదిన' అంటూ రష్మికపై ఆనంద్ దేవరకొండ ఎమోషనల్ పోస్టు!
ఈ వార్తాకథనం ఏంటి
ఫిబ్రవరి 26న విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న ఘనంగా వివాహ బంధంలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తుండగా, పలువురు సినీ ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక తాజాగా విజయ్ సోదరుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో చేసిన పోస్టు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రష్మిక, తన అన్నతో కలిసి దిగిన ఓ ఫోటోను షేర్ చేస్తూ 'వదిన' అంటూ భావోద్వేగ సందేశం పోస్ట్ చేశారు.
Details
వారు జీవితాంతం నవ్వుతూ, ఆనందంగా ఉండాలి
తన పోస్టులో ఆనంద్ ఇలా పేర్కొన్నారు. చాలాసార్లు ఫ్యాన్స్ 'వదిన ఎలా ఉన్నారని అడిగేవారు. అప్పుడు ఎలా స్పందించాలో అర్థం కాలేదు. కానీ ఈరోజు మా అన్న పెళ్లి చేసుకున్నారు. ఎంతో పాజిటివ్‌గా, దయతో ఉండే వ్యక్తి మా కుటుంబంలో వదినగా వచ్చారు. వారు జీవితాంతం ఇలాగే నవ్వుతూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. ఈ భావోద్వేగ సందేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అభిమానులను ఆకట్టుకుంటోంది.