Page Loader
Anant Radhika Wedding: అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల వివాహ వేడుకలో రాపర్ రెమా ప్రదర్శన 
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల వివాహ వేడుకలో రాపర్ రెమా ప్రదర్శన

Anant Radhika Wedding: అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల వివాహ వేడుకలో రాపర్ రెమా ప్రదర్శన 

వ్రాసిన వారు Stalin
Jul 12, 2024
04:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

జూలై 12న ముంబైలోని జియో వర్డ్ సెంటర్‌లో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లి చేసుకోనున్నారు. ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరుకు స్టార్స్ హాజరవుతున్నారు. ప్రపంచం నలుమూలల నుంచి ఈ పెళ్ళికి అతిథుల హాజరవుతున్నారు. 'బేబీ కమ్ డౌన్' గాయని, నైజీరియన్ రాపర్ రెమా కూడా వివాహ వేడుకలో ప్రదర్శన కోసం తన బృందంతో ముంబై చేరుకున్నారు. ఈ పెళ్లిలో పాట పాడేందుకు అతను కోటి రూపాయలు తీసుకున్నాడు.

వివరాలు 

రెమా పెర్ఫార్మన్స్ కోసం రూ.25 కోట్లు  

మీడియా కథనాల ప్రకారం, పెళ్లి వేడుకలో రెమా తన పెర్ఫార్మన్స్ కోసం 25 కోట్లు తీసుకున్నారు. 2022లో విడుదలైన 'కమ్ డౌన్' పాట తో అతను ప్రపంచ ప్రసిద్ధి చెందాడు 'చార్మ్', 'జింజర్ మి' లాంటి ఎన్నో హిట్ సాంగ్స్ తో ఎంతో పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు రాధిక-అనంత్ ల పెళ్లిలో రెమా తన పాటలతో ఉర్రుతలూగించనున్నాడు. తన వైరల్ సాంగ్ 'కమ్ డౌన్' కూడా పాడనున్నాడు. మరోవైపు, కిమ్ కర్దాషియాన్ కూడా అంబానీ వివాహ వేడుకలో కనిపించనుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ముంబైకి చేరుకున్న  రెమ