NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / 2014ఎన్నికల ప్రచారం కేసులో మెగాస్టార్ చిరంజీవికి ఊరట 
    తదుపరి వార్తా కథనం
    2014ఎన్నికల ప్రచారం కేసులో మెగాస్టార్ చిరంజీవికి ఊరట 
    చిరంజీవిపై కేసును కొట్టివేసిన హైకోర్టు

    2014ఎన్నికల ప్రచారం కేసులో మెగాస్టార్ చిరంజీవికి ఊరట 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jul 26, 2023
    12:52 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మెగాస్టార్ చిరంజీవికి గుంటూరు హైకోర్టులో ఊరట లభించింది. 9ఏళ్ల క్రితం నాటి కేసులో ఆయనకు ఉపశమనం లభించింది.

    2014ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేసారు చిరంజీవి. ఆ సమయంలో ఎన్నిక ల నియమావళి అతిక్రమించినందుకు గాను చిరంజీవిపై కేసు నమోదైంది.

    రాత్రి 10గంటలు దాటిన తర్వాత ఎన్నికల ప్రచారం నిర్వహించకూడదనే నియమం ఉన్నప్పటికీ, చిరంజీవి ప్రచారం చేసారనీ, దానివల్ల ట్రాఫిక్ కి అంతరాయం కలిగిందనీ గుంటూరు జిల్లా అరండల్ పేట పోలీసులు కేసు నమోదు చేసారు.

    అప్పటి నుండి గుంటూరు రైల్వే కోర్టులో విచారణ కొనసాగుతూనే ఉంది.

    Details

    హైకోర్టును ఆశ్రయించిన చిరంజీవి 

    అయితే రైల్వే కోర్టులో కొనసాగుతున్న విచారణను నిలిపివేయాలని మెగాస్టార్ చిరంజీవి హైకోర్టును ఆశ్రయించారు. జులై 25వ తేదీన హైకోర్టు ఎదుటకు ఈ కేసు విచారణకు వచ్చింది. ఈ క్రమంలో చిరంజీవి తరపు న్యాయవాది తమ వాదనలు వినిపించారు.

    అనంతరం ఈ కేసును కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. 9ఏళ్ల నాటి కేసులో చిరంజీవికి ఊరట లభించింది.

    2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి, 2009లో కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేసారు. ఆ తర్వాత కాంగ్రెస్ నుండి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.

    కేంద్రమంత్రిగా కూడా చిరంజీవి పనిచేసారు. 2014 నుండి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చిరంజీవి
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    చిరంజీవి

    డ్రగ్ మాఫీయాపై ఉక్కుపాదం.. గ్యాంగ్ స్టర్లే లక్ష్యంగా ఎన్ఐఏ దాడులు చలికాలం
    రంగమార్తాండ: చిరంజీవి గొంతుకలో నటుడికి నిర్వచనం.. అనిర్వచనం టాలీవుడ్
    వాల్తేరు వీరయ్య: ప్రమోషన్లలో ఆలస్యం.. కారణం అదే టాలీవుడ్
    వాల్తేరు వీరయ్య: మెగాస్టార్ తో మాస్ మహారాజ్ స్టెప్పులు.. సాంగ్ వచ్చేస్తోంది తెలుగు సినిమా

    తెలుగు సినిమా

    ప్రియదర్శిని అలా పోల్చవద్దని ఫైర్ అయిన రాహుల్ రామకృష్ణ  సినిమా
    సైంధవ్ సినిమా హార్ట్ ని పరిచయం చేసిన విక్టరీ వెంకటేష్  వెంకటేష్
    హిండింబ సినిమా నుండి రివర్స్ యాక్షన్ ట్రైలర్ విడుదల  ట్రైలర్ టాక్
    పవన్ అభిమానులకు పండగ లాంటి వార్త: బ్రో సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేసింది  పవన్ కళ్యాణ్

    సినిమా

    వార్ 2 సినిమాలో నటించడంపై నోరు విప్పిన కియారా అద్వానీ  జూనియర్ ఎన్టీఆర్
    ప్రాజెక్ట్ కె: అమెరికాలో ప్రభాస్ అభిమానుల కార్ ర్యాలీ; కార్లతో ప్రాజెక్ట్ కె లోగో  ప్రాజెక్ట్ కె
    హాలీవుడ్ నుండి టాలీవుడ్ దాకా: ఈవారం థియేటర్లలో రిలీజయ్యే సినిమాల లిస్టు  సినిమా రిలీజ్
    నాయకుడు ఓటీటీ రిలీజ్: రిలీజై రెండు వారాలు పూర్తి కాకముందే స్ట్రీమింగ్ కు సిద్ధం  ఓటిటి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025